
కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే కేజీఎఫ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2016లో మిస్ సుప్రానేషనల్ టైటిల్ గెలిచిన అనంతరం, ఆమెకు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి అనేక అవకాశాలు వచ్చాయి. అయితే, తాను చిన్న పాత్రలకంటే మెరుగైన కథల కోసం వెయిట్ చేస్తానని భావించి, యష్ సరసన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ లో నటించడం ఆమె కెరీర్‌కు బలమైన ఆరంభాన్ని ఇచ్చింది.
కేజీఎఫ్ మొదటి పార్టులో ఆమె పాత్రకు అంత ప్రాముఖ్యత లేకపోయినా, ఆమెకు వచ్చిన గుర్తింపు మాత్రం పెద్దదే. కానీ కేజీఎఫ్ 2 విడుదలయ్యే వరకు కొత్త ప్రాజెక్టుల్ని ఎంచుకోకపోవడం, కొంతవరకు ఆమెకు నష్టమే అయింది. ఆమె తక్కువ కాలంలో వచ్చిన ఆఫర్లను తిరస్కరించడం వల్ల, పలు ప్రముఖ చిత్రాలు ఆమెకు దూరమయ్యాయి.
తర్వాతి దశలో ఆమె తమిళంలో విక్రమ్‌తో కలిసి కోబ్రా అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఫెయిల్ కావడంతో, శ్రీనిధికి ఆశించిన గుర్తింపు రాలేదు. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో, తెలుగులో రెండు అవకాశాలను ఒప్పుకుంది. నాని సరసన హిట్ 3 లో నటించిన ఆమె, ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా చిత్రంలో మరో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది.
హిట్ 3 హిట్ అయినా శ్రీనిధికి పెద్దగా లాభం జరగలేదు. అవకాశాల పరంగా కూడా అనుకున్న స్థాయికి రాలేదు. ప్రస్తుతం ఆమె తెలుసు కదా సినిమాపై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత ఆమెకు మళ్లీ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం శ్రీనిధి కన్నడలో కిచ్చ సుదీప్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. అయితే, ఆ సినిమాలో ఆమె పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అనేది అనుమానంగా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్లకు స్కోప్ తగ్గినట్టే కనిపిస్తుంటుంది.
మొత్తంగా చూస్తే, కెరీర్ ఆరంభంలో వచ్చిన భారీ అవకాశాలను సరైన సమయంలో వినియోగించుకోకపోవడం ఆమెకు పెద్ద లాస్ అయినట్టే. “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అన్న సామెతను గుర్తు చేస్తూ, పరిశీలకులు ఆమె భవిష్యత్తు ఎలాంటి దిశలో సాగుతుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Recent Random Post:















