
కేరళ పాలక్కాడ్‌కి చెందిన మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. పవన్ కల్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అందగత్తె, ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో క్రేజీ స్టార్లతో వరుసగా సినిమాలు చేస్తూ ‘గోల్డెన్ లెగ్’ హీరోయిన్గా మారిపోయింది.
ప్రస్తుతం నిఖిల్‌తో కలిసి రామ్ చరణ్ సమర్పణలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభు, అలాగే బాలయ్యతో అఖండ 2 వంటి మాస్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సీక్వెల్ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
ఇక, తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందనున్న మరో పాన్ ఇండియా సినిమాకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా 7 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్లో కాజోల్‌తో కలిసి నటిస్తున్న మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్ సినిమాతో హిందీ బాటపై కూడా అడుగుపెడుతోంది.
తెలుగులో శర్వానంద్ సరసన నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటిస్తున్న హైందవ, వంటి సినిమాలతో ఫుల్ బిజీ. హైందవ మూవీ ఇప్పటికే విడుదలైన టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇది పాన్ ఇండియా రిలీజ్‌గా ప్లాన్ చేస్తున్నారు.
మలయాళంలో మోహన్‌లాల్‌తో రామ్ సినిమాలోనూ కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ తిరిగి త్వరలో మొదలుకానుంది. అంతేకాదు, లోకేష్ కనగరాజ్ సైనిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాఘవ లారెన్స్ హీరోగా నటించే బెంజ్ చిత్రంలో భాగ్యరాజ్ కన్నన్ డైరెక్షన్లో హీరోయిన్గా నటిస్తోంది.
ఇలా వరుసగా 7 క్రేజీ ప్రాజెక్టులతో సంయుక్త 2025 డైరీ ఫుల్ బుక్ చేసుకుంది. అటు కమర్షియల్ మాస్ సినిమాలు, ఇటు ఉమెన్ సెంట్రిక్ కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో బ్యాలెన్స్ చేస్తూ, అన్ని భాషలలో తన మార్క్ చూపుతోంది. ఈ ప్లానింగ్ చూసిన ఫ్యాన్స్ మాత్రం – “ఇది మామూలు ప్లానింగ్ కాదు, సంయుక్త మాస్ అటాక్!” అంటూ షాక్ అవుతున్నారు.
Recent Random Post:















