
సాయి పల్లవి, ‘ప్రేమమ్’ సినిమా ద్వారా మలయాళ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. తన తొలి సినిమాతోనే “భానుమతి.. ఒక్కటే పీస్..హైబ్రిడ్ పిల్ల” అంటూ అభిమానులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో ఆమె తెలంగాణ యాసలో అద్భుతంగా నటించారు.
ఆ తర్వాత సాయి పల్లవి సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకోవడం ప్రారంభించి, “లేడీ పవర్ స్టార్” అనే బిరుదు కూడా సొంతం చేసుకున్నారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి, ప్రతి పాత్రకు ప్రాధాన్యతనిస్తూ తనకంటూ ప్రత్యేక మార్క్ సృష్టించారు.
ప్రస్తుతం సాయి పల్లవి దక్షిణ భారతంలో వరుస సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే బాలీవుడ్లో కూడా రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటిలో, జునైద్ ఖాన్ నటిస్తున్న రొమాంటిక్ చిత్రం ‘ఏక్ దిన్’, ఇది 2025 నవంబర్ 27న విడుదల కానుంది. మరో సినిమా ‘రామాయణం’, ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టబోతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమారు ₹4,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించబడింది.
సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, సాయి పల్లవి వెక్కేషన్ కోసం సమయం కూడా దొరుకుతుందీ. తాజాగా, ఆమె వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయిన తన చెల్లెలు పూజా కన్నన్ ఇంటికి వెళ్లి బీచ్ వెకేషన్ ను ఎంజాయ్ చేశారు. వీరిద్దరూ ఇసుకలో ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా స్విమ్ చేస్తూ తీసుకున్న ఫోటోలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
అక్కాచెల్లెలు సంతోషంగా ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం, అభిమానుల మధ్య సాయి పల్లవిని ఇలా సంతోషంగా చూడడం హృదయానికి హాయిగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. ఈ బీచ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయంగా మారుతున్నాయి.
Recent Random Post:















