
ఇప్పుడు ప్రతి చోటా సినిమాటిక్ యూనివర్స్ క్రేజ్ నడుస్తోంది. మార్వెల్, కెజిఎఫ్, సలార్… ఇలా అందరూ విస్తరించిన యూనివర్స్‌లను ప్లాన్ చేస్తుండగా, మన పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూడా అలాంటి యూనివర్స్ తీస్తే ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప ఎంత పెద్ద సంచలనం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప రాజ్ ఫెనోమెనన్ దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ స్థాయి సక్సెస్ ను సుకుమార్ కూడా ముందే ఊహించలేదు. మొదట పుష్పను రెండు పార్ట్లతో ముగిస్తాడనుకున్నారు, కానీ క్రేజ్ దృష్ట్యా పుష్ప 3 కూడా ప్లాన్ చేశారు. అది కూడా మరో లెవెల్ రాంపేజ్గా ఉండబోతుందని టాక్.
కానీ పుష్ప 3 కంటే ముందు సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా లాక్ చేశారు. “రంగస్థలం” తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. ఇక్కడే ఫ్యాన్స్ ఒక క్రేజీ థియరీని డిస్కస్ చేస్తున్నారు —
చరణ్ సినిమా పుష్ప యూనివర్స్ లో జరిగితే?
చరణ్ లాంటి స్టార్ ను పుష్ప యూనివర్స్‌లో ఊహించుకోవడమే ఒక రేంజ్ హై ఇస్తోంది. చరణ్ పాత్రను పుష్ప రాజ్ కు సరితూగేలా రాసి, సినిమా చివర్లో పుష్ప 3కి లింక్ ఇస్తే? మరి పుష్ప 3లో అల్లు అర్జున్ – చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేస్తే?
అంటున్నారు ఫ్యాన్స్ —
“రికార్డులు కాదు, రికార్డుల మోత తప్పదు!”
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అన్నీ కలిస్తే ఈ కాంబో సినిమా ఊహించని స్థాయిలో హైప్‌కు చేరుతుందని స్పష్టంగా కనిపిస్తోంది.
RRR తో రాజమౌళి చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌ను స్థిరపరిచినట్టే, సుకుమార్ కూడా చరణ్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌ను తీసుకురాగలడా అనే చర్చ నడుస్తోంది.
ఇది ఇప్పటికైతే రూమర్ గానే కనిపించినా…
ఇలాంటిది నిజమైతే మాత్రం థియేటర్స్ ఇక థియేటర్స్ గా ఉండవు — పండుగే!
సుకుమార్ ఈ థాట్ ను సీరియస్ గా తలచుకుంటే,
చరణ్ పుష్ప యూనివర్స్ లోకి రావచ్చు
లేదా
చరణ్ సినిమా ద్వారా యూనివర్స్ స్టార్ట్ చేసి తర్వాత పుష్పను తీసుకురాగలరు.
Recent Random Post:















