సుహానా ఇంటర్వ్యూ ఇవ్వదు.. యాంకర్ కి మమ్మీ గౌరీ హెచ్చరిక

కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ కథానాయికగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. జోయా అక్తర్ రూపొందిస్తున్న ది ఆర్చీస్ ఇండియా వెర్షన్ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. ఇలాంటి తరుణంలో ఒక ఊహించని సంఘటనతో సుహానా పేరు ప్రముఖంగా హెడ్ లైన్స్ లోకి వచ్చింది. తన ఇంటర్వ్యూ కోసం వెంబడించిన ఓ న్యూస్ యాంకర్ ని సుహానా తల్లి గౌరీఖాన్ అడ్డుకోవడమే దీనికి కారణం.

ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం స్టార్-స్టడెడ్ ఎఫైర్ గా అత్యంత వైభవంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల్లో VJ కం నటి అనూషా దండేకర్ గౌరీ ఖాన్ ఆమె కుమార్తె సుహానాను కలిసిన వీడియో రాంగ్ రీజన్ తో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

అనూష ఒక బైట్ కోసం తల్లీకూతుళ్లను ఒప్పించే ప్రయత్నం చేస్తుంటే దానికి గౌరీ విముఖత చూపారు. సుహానా ఇంటర్వ్యూ తీసుకోవడానికి గౌరీ నిరాకరించారు. అయితే ఈ ప్రత్యేక క్షణం కెమెరాలో చిక్కుకుంది.
గౌరి-సుహానా తనను పట్టించుకోలేదని సోషల్ మీడియా యూజర్లలో ఒక వర్గం యాంకర్ అనూషను ట్రోల్ చేసింది. గౌరి- సుహానాలను ఇంటర్వ్యూలు ఇవ్వమని బలవంతం చేయడం సరికాదని కొందరు ఆమెపై మండిపడ్డారు.

”క్యా గజాబ్ బెజాతీ హై యార్” అని ఒక సోషల్ మీడియా వినియోగదారు రాశారు. ”అనూష వెలుగులోకి రావడానికి SRK కుటుంబాన్ని ఉపయోగించాలనుకుంటోంది” అని మరొకరు రాశారు. కానీ ఇలాంటి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత అనూష ఇన్ స్టాగ్రామ్ లో ట్రోల్స్ ను తిప్పికొట్టింది. మీరు ద్వేషించేవారిగా ఉండాలనుకుంటున్నందున ఈ ఈవెంట్ లో లేని వ్యక్తుల అభిమానులను పిలిచి నిరంతర వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను చెడుగా కనిపించినా కానీ బయటకు వచ్చేలా చూసుకోగలను.

క్షమించండి.. మీ ప్రణాళికలో భాగం కాలేను” అని రాసింది. కొందరికి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం ఉండదు.. ఎప్పుడూ ఇష్టం ఉండదు.. అది పూర్తిగా ఓకే. మరికొందరి ఇంటర్వ్యూలు చేసే వరకు వారి ని వదిలించుకోవడం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. నేను చాలా గొప్ప పని చేశానని చేసే పనిలో నేను చాలా మంచిగా నిజాయితీగా ఉన్నానని అనుకుంటున్నాను…కానీ మీకు చాలా అభిప్రాయాలు ఉంటే నా ఉద్యోగాన్ని ప్రయత్నించండి.. ఎవరూ ఆపలేదు. నేను మీ సంతోషాన్ని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు బెదిరింపులకు పాల్పడటం మానేయాలి” అని పంచ్ లు విసిరింది.

ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ లో తల్లీ కూతురు అనూషకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కానీ షారుఖ్ ఆమెతో వివరంగా మాట్లాడాడు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ కోసం నీతా అంబానీ విజన్ ను ప్రశంసిస్తూ SRK ఇలా అన్నారు. ”దీని కోసం నీతా చాలా సంవత్సరాలు ప్రయత్నించింది. నాకు తెలుసు 10 నుండి 12 సంవత్సరాల క్రితం మేం దీని గురించి చర్చించుకున్నాం. నీతా నాతో మాట్లాడుతోంది. ఆమె నాకు బ్లూప్రింట్ చూపించింది. దీన్ని పెద్దగా విభిన్నంగా డిజైన్ చేశారు.

ఇప్పుడు అంతకుమించి చాలా విభిన్నంగా రూపొందించారు. ఆత్మ కనిపిస్తోంది. ఇది అభిరుచితో కూడిన ప్రయాణం.. అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ది ఆర్చీస్ తో నటిగా పరిచయం అవుతున్న సుహానా ఇంటర్వ్యూ కంటెంట్ ను సంపాదించడంలో సదరు యాంకర్ కం నటి విఫలమైంది. కానీ ఒక జర్నలిస్టుగా నెటిజనులపై పంచ్ ల వర్షం కురిపిండంలో తన పనితనం నిరూపణ అయ్యింది.


Recent Random Post: