
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేకపోయినా, ఇప్పుడు మాత్రం సినిమా చుట్టూ భారీ హైప్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను, ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాయి. మాస్, కామెడీ, హారర్ మేళవింపుతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, వాటితో పోలిస్తే ‘ది రాజాసాబ్’ పూర్తి భిన్నంగా ఉండబోతోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నాడు. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్‌పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, త్వరలోనే ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాటకు థమన్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్టు సమాచారం. ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సాంగ్‌లో ఓ హీరోయిన్ కూడా కనిపించనుందట. అయితే ఆమె ఎవరు? అన్నది చిత్రబృందం సస్పెన్స్‌గా ఉంచింది. దీనితో ఈ పాట, సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది.
దర్శకుడు మారుతి పూర్తిగా షూటింగ్‌పై దృష్టి సారించి, ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 5న సినిమా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఆల్రెడీ వాయిదాలు వచ్చిన నేపథ్యంలో ఇక మరిన్ని డిలేలు లేకుండా పనులను వేగవంతం చేస్తున్నారు. విజువల్స్, కామెడీ, పాటలతో ఈ సినిమాను ఒక ఫుల్ ప్యాకేజ్ ఎంటర్‌టైనర్‌గా తయారు చేస్తున్నారు. ఇక ఈ సినిమా హిట్ అయితే, సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అన్ని వివరాలు చూస్తుంటే ‘ది రాజాసాబ్’ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టే స్పష్టంగా కనిపిస్తోంది.
Recent Random Post:















