
అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటీ’ చిత్రం నిజ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. బాధితురాలిగా ప్రారంభమై నేరస్తురాలిగా మారే ఓ మహిళ పాత్రలో అనుష్క పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. గంజాయి అక్రమ రవాణా నేపథ్యంతో కూడిన కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో, ఆంధ్రా-ఒడిశా అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలు ప్రేక్షకులకు మిగిలిపోయే అనుభూతిని ఇస్తాయని సమాచారం.
యాక్షన్ సన్నివేశాల విషయంలో అనుష్క ఎక్కడా రాజీపడకుండా నేచురల్ స్టంట్స్ చేసింది. రియల్ లొకేషన్లలో షూటింగ్ జరిపే సమయంలో డూప్ ఫైటర్లను తీసుకుందామని దర్శకుడు క్రిష్ భావించినా, అనుష్క మాత్రం స్వయంగా అన్ని సన్నివేశాల్లో నటించేందుకు ముందుకొచ్చిందట. ఈ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది.
అంతేకాదు, చిత్రీకరణలో అత్యంత సాహసోపేతమైన ఘట్టమేమిటంటే, నక్సల్స్ ప్రాబల్యమున్న దంతెవాడ అటవీ ప్రాంతంలో కూడా కీలకమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడమే. అక్కడ షూటింగ్ నిర్వహించడం చాలా సవాలుగా మారినా, క్రిష్-అనుష్క ఎక్కడా రాజీపడకుండా రిస్క్ లొకేషన్లలోనే పని పూర్తి చేశారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ‘ఘాటీ’ తన విభిన్న కథ, అద్భుతమైన లొకేషన్లు, అనుష్క నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుందని భావిస్తున్నారు.
Recent Random Post:















