ఒకే ఒక జీవితం తరవాత… షర్వా ఫుల్ బిజీ!

Share


ఇదిగో శర్వానంద్ ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్!
‘ఒకే ఒక జీవితం’ హిట్ తర్వాత శర్వా నుండి ఊహించిన వేగం కనిపించకపోయినా, ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫోర్స్‌లో వస్తున్నాడు. మూడేళ్ల గ్యాప్‌లో ‘మనమే మాత్రమే’ ఒక్కటే రిలీజ్ అవగా, అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. పెళ్లి వంటి వ్యక్తిగత కారణాలతో కొంత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు సెట్స్‌పై పెట్టేశాడు.

ఆ రెండింటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్నది ‘నారి నారి నడుమ మురారి’. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో శర్వా ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కుపోయిన మధ్య వయస్సు యువకుడి పాత్రలో కన్పించనున్నాడని టాక్. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందనీ, కేవలం ప్యాచ్ వర్క్ కొద్దిగా మిగిలిందని తెలుస్తోంది. తాజాగా ఓ ప్రముఖ ఓటిటి సంస్థతో డీల్ కుదిరిందట. ఇప్పటివరకు ఫినిష్ చేసిన పార్ట్ చూసిన ఆ సంస్థ ప్రతినిధులు బాగా ఇంప్రెస్ అయ్యారని, ఒప్పందం కుదిరిన వెంటనే థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈసారి బాలకృష్ణ 1990 క్లాసిక్ టైటిల్‌ను తన సినిమాకు ఎంచుకుని, శర్వానంద్ “ఒకే ఒక జీవితం కంటే పెద్ద హిట్ కొట్టాలి” అనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇది పూర్తయ్యాక, అభిలాష్ రెడ్డి డైరెక్షన్‌లో బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందుతున్న మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. దీనికి ‘జానీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే ప్యాన్ ఇండియా సినిమాకు కూడా శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మొత్తంగా చూస్తే… ఇకపై శర్వానంద్ నుంచి వరుసగా సినిమాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో కనీసం మూడు సినిమాలు రిలీజ్ కావడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి కథా చర్చలు కూడా జోరుగా జరుగుతున్నాయట.


Recent Random Post: