ఇంకో 43 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న “కన్నప్ప” సినిమాపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆధ్యాత్మిక పాన్-ఇండియా ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను అందుకున్నాయి. కొత్త సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సి అయినప్పటికీ, ఆయన మ్యూజిక్ అందరికీ త్వరగా కనెక్ట్ అయింది. మిగిలిన పాటలు మరింత గొప్ప స్థాయిలో ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశంగా మారింది. థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ హక్కులు ఇంకా క్లోజ్ చేయలేదట. కారణం – విష్ణు ఈ హక్కుల నుంచి భారీ రెవెన్యూ ఆశిస్తున్నట్లు టాక్.
తన వ్యక్తిగత ఇమేజ్‌ను కాకుండా, కంటెంట్ మీద ఉన్న నమ్మకమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. స్టార్ కాస్టింగ్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, హై-ఎండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు విష్ణుకి మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయని సమాచారం. అందుకే, తక్కువ ధరలకు ముందుగా అమ్మేయకుండా, ట్రైలర్ విడుదల తర్వాత వచ్చే బజ్ ఆధారంగా హక్కులు విక్రయించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల వరకు ట్రోలింగ్ టార్గెట్ గా మారిన “కన్నప్ప”, ఇప్పుడు క్రమంగా పాజిటివ్ బజ్ ఏర్పరుచుకుంది. టీజర్‌లో ప్రభాస్‌తో పాటు కాస్టింగ్ మొత్తం రివీల్ చేయడం సోషల్ మీడియాలో భారీ హైప్ తీసుకువచ్చింది.
ఇప్పటిదాకా అన్నీ అనుకూలంగా మారినా, అసలైన సవాల్ ఇప్పుడే మొదలవుతోంది. సినిమా బజ్‌ను ఇలానే కొనసాగించేందుకు పబ్లిసిటీ ప్రణాళికను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. శ్రీకాళహస్తిలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ స్టార్ క్యాస్టింగ్‌ను ఒకే వేదికపైకి తేవాలని టీమ్ ప్రయత్నిస్తోంది. అయితే అందరి డేట్లు సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది.
ఇక ఏప్రిల్‌లో “హరిహర వీరమల్లు” విడుదల అవకాశాలు తగ్గిపోవడంతో, బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ “కన్నప్ప”కు ఉత్తరాదిలో మంచి మద్దతు దొరికేలా స్ట్రాటజీ అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన హైప్‌ను మరింత పెంచేలా “కన్నప్ప” టీమ్ భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈసారి మంచు విష్ణు స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? “కన్నప్ప” ఆశించిన స్థాయిలో హిట్ అవుతుందా? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Recent Random Post: