
వారణాసి సినిమాపై సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి వరుసగా ఇస్తున్న లీక్స్‌తో దర్శకుడు రాజమౌళి షాక్ అవ్వక తప్పడం లేదు. ప్రతి రాజమౌళి చిత్రానికి కీరవాణి సంగీతం ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేం—ఆయన మ్యూజిక్ వస్తే ఎలివేషన్ సీన్స్‌కు మరో లెవల్ లో హెవీనెస్ చేరుతుంది. అందుకే ఈ కాంబినేషన్‌ను ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అంటారు.
రాజమౌళి తాజా సినిమా వారణాసికి కూడా కీరవాణి అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన “సంచారీ” సాంగ్‌తో పాటు “కుంభ ఎంట్రీ” సాంగ్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.
ఇటీవల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా కీరవాణి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. వారణాసిలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని, అవన్నీ చాలా బాగా వచ్చాయని వెల్లడించాడు. “మన పని మనం పర్ఫెక్ట్‌గా చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు… నేను వారణాసి మ్యూజిక్ విషయంలో చాలా ప్రశాంతంగా ఉన్నాను” అని చెప్పాడు.
కానీ ప్రోమోషన్స్ విషయంలో రాజమౌళి ప్లాన్ ఒకటి, కీరవాణి స్టేజ్ మీద మైక్ దొరికితే ఒకటి అన్నట్టుంది. వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో కూడా సినిమా రిలీజ్ 2027 సమ్మర్‌లో ఉండబోతుందని ముందే చెప్పేశాడు. అదే రాజమౌళికి కూడా అన్ ఎక్స్‌పెక్టెడ్ షాక్ అయ్యిందని ఇండస్ట్రీ టాక్.
ఇప్పుడు మ్యూజిక్ అప్డేట్‌తో మళ్లీ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు కీరవాణి. రాజమౌళి సినిమాల్లో ఎవరు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అన్నది స్క్రిప్ట్‌లా ముందే ఫిక్స్ అయిపోయే విషయం. కానీ కీరవాణిపై అలాంటి కండీషన్స్ పెట్టలేదా? లేక అన్నయ్య కావడంతో జక్కన్న సైలెంట్‌గా ఉంటున్నాడా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నాడు. విస్తృతంగా వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకి గ్లింప్స్ కట్ చేయడానికే రాజమౌళి టీమ్ ఏడాది పాటు కష్టపడ్డారని తెలిసిన సంగతే.
Recent Random Post:















