గేమ్ ఛేంజర్ శంకర్ కెరీర్‌ని మార్చిందా?

Share


ఒక‌ప్పుడు సౌత్ ఇండియాను శాసించిన టాప్ డైరెక్ట‌ర్స్‌లో శంక‌ర్ పేరు ముందు వరుస‌లో ఉండేది. జెంటిల్‌మేన్ నుంచి రోబో వ‌ర‌కు అత‌ని కెరీర్‌లో బిగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఉన్నాయి. కానీ గేమ్ ఛేంజర్తో అత‌నికి ఎదుర‌య్యిన బోల్తా ఇప్పుడు ఇండ‌స్ట్రీ మొత్తం ప‌రిస్థితిని మార్చేసింది.

రామ్‌ చ‌ర‌ణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన గేమ్ ఛేంజర్ భారీ బ‌డ్జెట్‌తో రూపొందినప్పటికీ, విడుదల తర్వాత తీవ్ర నిరాశను మిగిల్చింది. దాంతో నిర్మాతలు నష్టాలను బహిరంగంగా అంగీకరించడమే కాకుండా, శంకర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత శిరీష్ ప్రకారం, సినిమా విడుదలైన తరువాత శంకర్ కనీసం సంప్రదింపులు కూడా చేయలేదట.

ఇప్పటికే ఇండియన్ 2 ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఇక ఇండియన్ 3 గురించి ఆశలు ఉన్నా, విడుదల తేదీ ఇంకా తెలియలేదు. అలాగే శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వేల్పరి కూడా ఇప్పుడు అనిశ్చితిలో పడింది. వేంకటేశన్ రాసిన నవల ఆధారంగా మూడువిభాగాలుగా రూపొందించాలన్న శంకర్‌ కల ఇప్పుడు దాదాపు ఆగిపోయినట్టు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకర్‌తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. నిర్మాణ సంస్థలు, నిర్మాతలు, చిన్న హీరోలు కూడా అతడితో పని చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఒకప్పటి డైరెక్టర్ శంకర్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా, శంకర్ మళ్లీ తన మార్క్‌ను చూపించాలంటే కొత్త టాలెంట్‌తో చిన్న బడ్జెట్‌లో ఒక బలమైన కంటెంట్ సినిమాతో తనను తాను రీప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే అతని వైభవాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నది నెటిజన్ల అభిప్రాయం.


Recent Random Post: