ఏడుపదుల వయసులోనూ తన ఎనర్జీతో యువ హీరోలకే సవాలు విసురుతూ స్టేజిపై స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు తన ఫిట్‌నెస్ వెనకున్న అసలైన రహస్యాన్ని వెల్లడించారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత బరువును తగ్గించి, తను ఎంత ఫిట్‌గా ఉన్నాడో నిరూపించిన చిరు, తాజాగా యోగాతో తన అనుబంధాన్ని షేర్ చేశారు.
తాజాగా తన సోషల్ మీడియా ద్వారా చిరు ఓ పోస్టు చేసి యోగా ప్రాముఖ్యతను అందరికీ గుర్తు చేశారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, యోగా అనేది భారత్ ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతిగా అభివర్ణించారు.
“ఫోకస్ మన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది, కానీ యోగా మాత్రం శారీరక ధృఢతతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరచే మార్గం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనమందరం కలిసి జరుపుకుందాం. ఇది బోర్డర్లను దాటి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన ఉద్యమంగా మారింది” అని చిరంజీవి అన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, చిరు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రం సంక్రాంతి 2025 సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Recent Random Post: