
కన్నడలో ‘కిస్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల, తెలుగులో 2021లో ‘పెళ్లి సందడి’తో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ అదృష్టవశాత్తు రవితేజ సరసన వచ్చిన ధమాకా సినిమాతో శ్రీలీలకు గేమ్‌చేంజర్ వచ్చినట్లైంది. ఆ సినిమాలో ఆమె అందం, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్‌తో ఫుల్ మార్కులు కొట్టేసింది.
ధమాకా హిట్‌తో ఒక్కసారిగా శ్రీలీలకు అవకాశాల పంటపండింది. అర డజను సినిమాలకుపైగా అవకాశాలు వచ్చి పడటమే కాక, ఏడాదిలోనే డజనుకు పైగా సినిమాలతో బిజీ అయి రికార్డు సృష్టించింది. ఒకటిన్నరేళ్లలో చేసిన సినిమాల్లో కొన్ని విజయాలు అందించగా, మరికొన్ని ఆమెను నటిగా, డాన్సర్‌గా గుర్తింపును తీసుకొచ్చాయి.
2024 చివర్లో విడుదలైన పుష్ప 2లో ‘కిస్సిక్ సాంగ్’తో శ్రీలీల పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ సాంగ్ హిందీలో కూడా సూపర్ హిట్ కావడంతో ఆమెకు బాలీవుడ్ నుంచే కాకుండా తమిళ్లోనూ అవకాశాలు దక్కాయి.
ఇప్పుడు శ్రీలీల ఏకంగా నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. కన్నడలో జూనియర్, తెలుగులో మాస్ జాతర, తమిళ్లో పరాశక్తి, హిందీలో ఆషికి 3 సినిమాలతో బిజీగా ఉంది. ఇంకా ఆషికి 3 విడుదల కాకముందే బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌తో శ్రీలీల మరో సినిమా చేసే అవకాశం దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు దర్శకుడు బాబీ తెరకెక్కించే ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించనుందట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు తమిళ్లో పరాశక్తి విడుదల కాకుండానే మరో సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
మొత్తానికి అన్ని భాషల్లో డిమాండ్ ఉన్న మోస్ట్ బిజీ హీరోయిన్గా శ్రీలీల దూసుకెళ్తోంది.
Recent Random Post:















