జూనియర్ ధనుష్ ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా హైప్

Share


యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ అలియాస్ జూనియర్ ధనుష్ ఇప్పుడు తెలుగులో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లవ్ టుడేతో యూత్‌ఫుల్ హిట్ అందుకున్న అతడు, ఇటీవల విడుదలైన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్తో మరో విజయం సాధించాడు. భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు అతడిని తెగ ఆరాధిస్తున్నారు. ఇకపై ప్రదీప్ మంచి కంటెంట్‌తో ఏ సినిమా చేసినా, మరింత భారీ స్థాయిలో ఆదరణ దక్కేలా కనిపిస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్‌ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రదీప్‌తో ఓ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీర్తీ శ్వరణ్ అనే కొత్త దర్శకుడు మెగాఫోన్ పట్టాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 30% షూటింగ్ పూర్తయింది.

ఈ సినిమాలో ప్రదీప్ సరసన ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారు. ఇప్పటికే మమితా బైజు హీరోయిన్‌గా ఫిక్స్ కాగా, మిగిలిన రెండు పాత్రలకు అను ఇమ్మాన్యుయేల్, ఐశ్వర్య శర్మ ఎంపికైనట్టు సమాచారం. మొదటి సినిమాలో లెక్కలేనన్ని గాళ్‌ఫ్రెండ్స్, రెండో సినిమాలో ఇద్దరితో రొమాన్స్ చేసిన ప్రదీప్, మూడో చిత్రంలో ఏకంగా ముగ్గురు భామలతో స్క్రీన్‌పై సందడి చేయనున్నాడు.

ప్రదీప్ రంగనాథన్ యూత్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథలను నూతన దర్శకులు రెడీ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో భారీ లాభాలు తెచ్చే కథాంశాలనే ప్రాధాన్యతనిస్తూ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలు తక్కువ బడ్జెట్‌లో తీసి నిర్మాతలకు మంచి ప్రాఫిట్ ఇచ్చాయి. ఈ విజయాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ పెద్దగా ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేశారు.

ఇదిలా ఉంటే, ప్రదీప్ రంగనాథన్ సినిమాల పరంగా తన రొమాంటిక్ బోయ్ ఇమేజ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అతడు, ఈ కొత్త సినిమాతో మరోసారి యువతను ఆకట్టుకుంటాడేమో చూడాలి!


Recent Random Post: