సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు హిట్ సినిమాల తర్వాత కూడా సరైన కథ కోసం ఓపికగా వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారిలో సమంత కూడా ఒకరు. గత కొంతకాలంగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
2023లో విడుదలైన ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నుంచి ఏ తెలుగు సినిమా రాలేదు. లేడీ ఓరియెంటెడ్ కథలు వచ్చినా కూడా ఆమె పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆమె ఓ కొత్త ప్రాజెక్ట్‌తో రీఎంట్రీకి సిద్ధమవుతోందని టాక్. ఈసారి సమంత కథ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటోందట.
సమంత ఇటీవల తన ప్రొడక్షన్ హౌస్ త్రలలా మూవింగ్ పిక్చర్స్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి ప్రాజెక్ట్‌గా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించినా, ఇందులో ఆమె నటిస్తుందా లేదా కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే తీసుకుంటుందా అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన కథకు సమంత ఓకే చెప్పినట్లు సమాచారం.
సమంత-నందిని రెడ్డి కాంబినేషన్‌లో ఇదివరకే ‘జబర్దస్త్, ఓ బేబీ’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడోసారి ఈ ఇద్దరి కలయికలో మరో విభిన్నమైన కథ రూపుదిద్దుకుంటోందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత కొంతకాలంగా నందిని రెడ్డి సమంత కోసం ఓ స్పెషల్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేస్తోందని, చివరికి అది ఆమెను మెప్పించిందని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సినిమా ఇప్పటివరకు సమంత చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని టాక్. దీన్ని సమంత తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా నిర్మిస్తుందా? లేక మరొక పెద్ద నిర్మాణ సంస్థతో కలిసి ప్రొడ్యూస్ చేస్తుందా? అన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తెలుగులో సినిమాలు తగ్గించిన తర్వాత సమంత హిందీ ప్రాజెక్ట్స్‌పై ఎక్కువగా దృష్టి సారించింది. ‘ది ఫ్యామిలీ మాన్ 2’ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆమె, ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి నటిస్తోంది.
హిందీలో అవకాశాలు పెరిగినా, తెలుగులో సమంతను అభిమానులు ఎంతగానో మిస్ అవుతున్నారు. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం. గతంలో ‘ఓ బేబీ’ వంటి హిట్ ఇచ్చిన నందిని రెడ్డితో మరోసారి జట్టు కట్టడం, ఈ ప్రాజెక్ట్‌ను ఆసక్తికరంగా మార్చింది. ఈ కొత్త సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందనేది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Recent Random Post: