టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా, అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు నిర్మించిన భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది.
సినిమా అనౌన్స్మెంట్ నుండే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పిన ‘తండేల్’ ఇప్పుడు మరింత పాజిటివ్ హైప్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. చిత్ర ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్, గ్లింప్స్, పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హైప్‌ను పెంచుతోంది.
ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్ రిలీజ్ కోసం మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం సినిమా డిస్ట్రిబ్యూషన్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. సినిమా ప్రణాళిక ప్రకారం, ‘తండేల్’ కి భారీ సంఖ్యలో డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారని సమాచారం. పాన్ ఇండియా హిట్ ‘కార్టికేయ-2’ తర్వాత చందూ మొండేటి చేస్తున్న సినిమా కావడం, చైతూ-సాయి పల్లవి జోడీకి ఉన్న క్రేజ్, గీతా ఆర్ట్స్ నిర్మాణం, ప్రమోషనల్ రిస్పాన్స్ ఇవన్నీ సినిమాపై మరింత ఉత్సాహాన్ని పెంచాయి.
అయితే, మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని రెంటల్ బేసిస్ పైనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. సినిమా బడ్జెట్ ₹90 కోట్లు కాగా, ప్రీ-రిలీజ్ బిజినెస్ ₹60 కోట్లు జరిగినట్లు సమాచారం. అయితే, థియేటర్లలో ₹40 కోట్లు షేర్ రాబడితే, ‘తండేల్’ హిట్ గా మారుతుంది.
ప్రస్తుతం ఉన్న బజ్ మరియు ప్రేక్షకుల స్పందన చూస్తుంటే, సినిమా హిట్ అవటం పెద్ద కష్టం కాదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Recent Random Post: