తారక్ – చరణ్ కొత్త లుక్స్‌: ఫ్యాన్స్‌కు షాక్ & సర్ప్రైస్!

Share


ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా ఎదిగారు. ఈ సినిమాతో వారి కెరీర్‌ మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాల్లో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇప్పుడు వారి లుక్స్‌లో కనిపిస్తున్న మార్పులు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

తారక్ అంటే ఎన్టీఆర్, గతంలో కొంచెం ఓవర్ వెయిట్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు చూసినవారెవరైనా “ఇది తారక్ ఏంటి?” అనిపించేలా మారిపోయారు. చాలా lean లుక్‌లో కనిపిస్తున్న ఆయన ప్రస్తుతం డైట్‌ విషయంలో చాలా డిసిప్లిన్ పాటిస్తున్నారు. మునుపు భోజనాన్ని ప్రేమించే తారక్, ఇప్పుడు పూర్తిగా డైట్‌పై ఫోకస్‌ చేశారు. ఇది సినిమా కోసమో, లేక ఆరోగ్య పరంగా తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తారక్ ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ సినిమాకోసం లుక్ మార్చిన ఆయన, అదే లుక్‌తో వర్క్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, రామ్ చరణ్ మాత్రం తారక్‌కు పూర్తి వ్యత్యాసంగా బల్కీ లుక్‌లో కనిపిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తోన్న ‘పెద్ది’ సినిమాలో మాస్ అండ్ రఫ్ రోల్ కోసం, ఆయన కాస్త మాస్ లుక్‌కి తగ్గట్లు తన శరీరాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ మాస్ లుక్ చరణ్‌కు చాలా బాగా సెట్ అయిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఒకరికి lean లుక్, మరొకరికి bulky లుక్ – ఈ స్నేహితులు ఇద్దరూ తమ కొత్త రూపాలతో ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని అందిస్తున్నారు. వారి dedication చూసి అభిమానులు గర్వపడకుండా ఉండలేరు!


Recent Random Post: