త్రివిక్రమ్ సినిమాకు సాయిపల్లవి – ఆసక్తికర చర్చ!

Share


సాయిపల్లవిని హీరోయిన్‌గా ఒప్పించడం ఎంత కష్టమైన పనో ఇటీవల దర్శకుడు చందూ మొండేటి తన అనుభవంతో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆమెను ఒప్పించే సమయంలో ఎన్ని సందేహాలు నివృత్తి చేయాలో, ఎంత శ్రమ పడాలో ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. “నా తర్వాత సాయిపల్లవితో పని చేసే దర్శకుడికి గట్టి పరీక్షే!” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్‌లో రామాయణం ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. తెలుగులో మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాలపై క్లారిటీ రాలేదు. తండేల్ తర్వాత ఆమె ఏ ప్రాజెక్ట్ కమిట్ అవుతుందో సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇప్పుడీ క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా కోసం ఆమె పేరు పరిశీలనలో ఉందన్న వార్త ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఒక పాన్-ఇండియా ప్రాజెక్ట్ రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది మైథలాజికల్ టచ్ ఉన్న కథగా తెలుస్తోంది. ఇప్పటికే తొలి భాగం కథ సిద్ధం కాగా, ఇందులో హీరోయిన్ పాత్రకు సాయిపల్లవిని తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర యారోగెంట్ టోన్ కలిగి ఉండేలా డిజైన్ చేయబడిందట. ఆ పాత్రకు సాయిపల్లవి పర్ఫెక్ట్ గా సరిపోతుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. కేవలం గ్లామర్ కోణాన్ని నమ్ముకోకుండా, కథలో ఇంటిగ్రల్ పార్ట్‌గా ఉండేలా మలచడం అతని ప్రత్యేకత.

సాయిపల్లవిని ఒప్పించడం త్రివిక్రమ్‌కు పెద్ద సవాలు కాకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన చేసే సినిమాల్లో స్పష్టత, కథా పరంగా పూర్తి క్లారిటీ ఉంటాయి. పాత్రల వివరణను సులభంగా, ఆకర్షణీయంగా చెప్పగల త్రివిక్రమ్ స్టైల్ ఆమెను ఒప్పించడంలో ప్రధాన పాత్ర పోషించవచ్చని అంటున్నారు.

ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా, సాయిపల్లవి – త్రివిక్రమ్ కాంబినేషన్ ఎవరూ ఊహించని కొత్త మ్యూజిక్ సృష్టించవచ్చని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


Recent Random Post: