నయనతార vs ధనుష్, పెళ్లి డాక్యుమెంటరీ వివాదం కోర్టు వరకు!

Share


నయనతార పెళ్లి డాక్యుమెంటరీ “నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్” ఇప్పుడు కోర్టు వివాదానికి దారి తీసింది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌లో నిర్మించిన “నాన్ రౌడీ ధాన్” చిత్రానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఉపయోగించారని, తన అనుమతి లేకుండా వాటిని పొందుపర్చారని ధనుష్ కోర్టును ఆశ్రయించడం తెలిసిందే.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే, నయనతార పెళ్లి డాక్యుమెంటరీలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సెకన్ల వీడియోలు కనిపించడంతో, ధనుష్ కోర్టుకు వెళ్లి దీనిపై కాపీ రైట్స్ ఉల్లంఘన కేసు వేశారు.

ఈ వ్యవహారంపై నయనతార కూడా తీవ్రంగా స్పందించింది. ధనుష్ కేసు వేసిన తరువాత, ఆ క్లిప్స్ వ్యక్తిగత కెమెరాలతో తీసినవే కానీ, సినిమా ఫుటేజీకి సంబంధించినవి కావు అని నయనతార తరపున న్యాయవాది వాదనలు వినిపించాడు. అయితే, ధనుష్ తరఫున లాయర్ మాత్రం అవి వ్యక్తిగత వీడియోలు అని చెప్పినా, సినిమాకు సంబంధించినదే కావడంతో కాపీ రైట్స్ ఉల్లంఘన కిందకే వస్తాయని వాదించారు.

ఈ కేసు తాజా విచారణలో, కోర్టు ధనుష్ అనుమతి లేకుండా చిత్ర క్లిప్స్ వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నయనతార రూ.1 కోటి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. కానీ, ఈ వివాదం తుది తీర్పు కోసం ఏప్రిల్ 9కి వాయిదా పడింది.

ధనుష్ ఈ విషయంపై వెనక్కి తగ్గే ఉద్దేశం లేకుండా, పూర్తిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో, నయనతార కూడా కోర్టులోనే ఈ కేసును తేల్చుకోవాలని చూస్తోంది. విఘ్నేష్ శివన్ కూడా ఈ వ్యవహారంలో నయనతార్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.

ఇక కోలీవుడ్ వర్గాలు మాత్రం, స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న ఈ వివాదం పరిశ్రమ వాతావరణానికి మంచిది కాదని అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ వివాదం నయనతార-ధనుష్ మధ్య ఉన్న దూరాన్ని బయటపెట్టిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, తన పెళ్లి డాక్యుమెంటరీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నయనతార ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే.

ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, కోర్టు తీర్పు చివరికి ఎవరికు అనుకూలంగా ఉంటుందో చూడాల్సి ఉంది.


Recent Random Post: