నాగార్జున – నాగచైతన్య ల్యాండ్‌మార్క్ సినిమాలు త్వరలో?

Share


కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య తమ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌లను ఒకేసారి ప్లాన్ చేస్తున్నారా? తండ్రీ-కొడుకులు ఇద్దరూ ఒకే ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నారా? అనే ఊహాగానాలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

నాగార్జున తన 100వ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ యువ టాలెంటెడ్ డైరెక్టర్ నవీన్‌తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు, విక్రం కె. కుమార్ పేరు కూడా ప్రాజెక్ట్‌తో జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా, ‘మనం’ తరహాలోనే మరో క్లాసిక్ సినిమా రూపొందించాలని నాగ్ ఆలోచిస్తున్నట్లు టాక్. అఖిల్, చైతన్య, సుమంత్‌లను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేయాలని అక్కినేని కాంపౌండ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదే సమయంలో, నాగచైతన్య కూడా తన 25వ సినిమా పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన 24వ చిత్రంలో బిజీగా ఉన్నప్పటికీ, 25వ ప్రాజెక్ట్ కోసం కొత్త దర్శకుడిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కిషోర్ అనే యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే కిషోర్ చైతన్యకు డిఫరెంట్ యాక్షన్ జానర్ కథ వినిపించినట్లు సమాచారం.

ఈ రెండు ప్రాజెక్ట్‌లు కన్ఫామ్ అయితే, తండ్రీ-కొడుకులిద్దరూ కొత్త టాలెంట్‌కు అవకాశం ఇచ్చినట్లే. నవీన్ కోలీవుడ్‌లో రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నవాడు, అలాగే కిషోర్ టాప్ రైటర్స్ & డైరెక్టర్స్ దగ్గర అనుభవం సంపాదించాడని టాక్. ఈ రెండు సినిమాలు ఒకేసారి పట్టాలెక్కి, పెద్ద ఎత్తున విడుదలైతే, అక్కినేని అభిమానులకు ఇది ఓ గ్రాండ్ ఫెస్టివల్ అవుతుంది. మరి, అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి!


Recent Random Post: