మలయాళ సినిమాల గురించి మాట్లాడితే, అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేర్లు సూపర్ స్టార్ మోహన్ లాల్, మెగాస్టార్ మమ్ముట్టీ. కేవలం కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా వీరికి అనేక మంది అభిమానులు ఉన్నారు. మలయాళంతో పాటు దక్షిణాది ఇతర భాషల సినిమాల్లోనూ, హిందీ చిత్రాల్లోనూ నటించిన ఈ లెజెండ్స్ సినిమాల పట్ల చూపించిన అంకితభావం గొప్పది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలందించిన వీరిద్దరికీ కేరళ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. వారి జీవిత చరిత్రలను బీఏ డిగ్రీ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది.
మహారాజాస్ కాలేజ్‌లో చదివిన మోహన్ లాల్, అదే కాలేజీలో బీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం రూపొందించిన “హిస్టరీ ఆఫ్ మలయాళ సినీమా” పాఠ్యంలో ప్రస్తావించబడ్డారు. ఈ పాఠ్యంలో మోహన్ లాల్ సినీ ప్రయాణం, ఆయన సాధించిన విజయాలు, మెగాస్టార్‌గా ఎదిగిన తీరును గురించి ప్రత్యేక వ్యాసంగా పొందుపరిచారు. కేరళ ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మలయాళ సినీ చరిత్రను పాఠ్యాంశంగా బోధించాలనే సంకల్పంతో ఈ చర్య చేపట్టింది.
ఇదే తరహాలో, మమ్ముట్టీ జీవితం కూడా పాఠ్యాంశంగా తీసుకువచ్చారు. మమ్ముట్టీ 430కి పైగా చిత్రాల్లో నటించిన అత్యంత సీనియర్ నటుడు. కమర్షియల్ చిత్రాలే కాదు, గాఢమైన భావోద్వేగాలతో కూడిన పాత్రల్లోనూ మెప్పించిన మమ్ముట్టీ, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పటికీ ప్రాధాన్యమైన పాత్రల్లో నటిస్తూ హిట్ చిత్రాలను అందిస్తున్నారు.
ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతున్న ఈ ఇద్దరు తారలు ఇండస్ట్రీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. మోహన్ లాల్ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. తాజాగా కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు.
వీరిద్దరి ప్రస్థానాన్ని విద్యార్థులకు పాఠ్యాంశంగా అందించడం కేవలం గౌరవాన్నే కాదు, కొత్త తరం నటులకు, సినీ ప్రేమికులకు స్ఫూర్తినిచ్చే అంశంగా సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Recent Random Post: