
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా మళ్లీ భారతీయ సినిమాల్లో అడుగుపెడుతోంది. 2016 వరకు బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసిన ప్రియాంక, ఆ తరువాత హాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యి అక్కడ సెట్ అయిపోయింది. హాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుంటూ, నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా విదేశాల్లోనే సెటిల్ అయింది. ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను కూడా తిరస్కరిస్తూ, అక్కడి ప్రాజెక్ట్స్‌లోనే బిజీ అయింది.
అయితే ఎప్పటికైనా ప్రియాంక మళ్లీ ఇండియన్ సినిమాల్లో నటిస్తుందని అభిమానులు ఎదురుచూశారు. ఆ వేచి చూపులకు ఫైనల్‌గా తెరపడింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌కు ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జక్కన్న రూపొందించనున్న ఈ ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది. అందుకే ప్రియాంక ఈ అవకాశాన్ని వదులుకోవడం లేదు. మహేష్ బాబు, ప్రియాంక జంట ప్రేక్షకులకు చక్కని విజువల్ ట్రీట్ అందించనుందని టాక్.
ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటోంది. మరోవైపు భారతీయ సినిమాల్లో మహేష్‌తో పాటు హృతిక్ రోషన్‌తో క్రిష్ 4 ప్రాజెక్ట్‌కు కూడా సైన్ చేసిందని సమాచారం. బాలీవుడ్ స్టార్‌గా కొనసాగిన ప్రియాంక హాలీవుడ్ వెళ్లాక ఆమె స్థానాన్ని కొంతవరకూ దీపిక పదుకొణె భర్తీ చేసినప్పటికీ, ప్రియాంకకు వచ్చిన ఇండియన్ ఆఫర్లపై ఆమె ఆసక్తి చూపలేదు. కానీ రాజమౌళి ప్రాజెక్ట్‌లో భాగమైన తర్వాత మళ్లీ భారతీయ సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
SSMB 29 (రాజమౌళి – మహేష్ బాబు చిత్రం)తో పాటు క్రిష్ 4లో కూడా నటిస్తున్న ప్రియాంక మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అయింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని, అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో నిర్మించనున్నారని తెలుస్తోంది. హాలీవుడ్‌లో మంచి పేరున్న ప్రియాంక ఇందులో భాగమవడం, ఆ సినిమాకు గ్లోబల్ బిజినెస్ పరంగా మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Recent Random Post:















