
మల్టీస్టారర్ సినిమాలు భారతీయ చిత్రసీమలో కొత్త కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అనేకమంది స్టార్ హీరోలు కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి టాలీవుడ్ దిగ్గజాలు మల్టీస్టారర్ మూవీస్ చేశారు. కానీ, కాలక్రమంలో స్టార్‌డమ్ పెరగడంతో హీరోలు సొంత సినిమాలకే పరిమితమయ్యారు.
ఇప్పటి తరం హీరోలలో మల్టీస్టారర్ సినిమాలు చేసినవారు చాలా తక్కువ. కథ డిమాండ్ చేసినా, ఇమేజ్ పరంగా హీరోలు ఈ తరహా ప్రాజెక్ట్స్‌ను ముందుకు తీసుకురావడం కష్టంగా మారింది. కానీ RRRతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో మల్టీస్టారర్ సినిమాలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అయితే ఇందులో ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చర్చనీయాంశంగా మారింది. అది రణ్‌బీర్ కపూర్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందే భారీ సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్ వస్తే అద్భుతంగా ఉంటుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ చర్చకు నాంది పలికింది నందమూరి బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 4లో బన్నీ పాల్గొన్నప్పుడు బాలయ్య రణ్‌బీర్ కపూర్ ఫోటో చూపించి, “మీరిద్దరూ కలిసి సినిమా చేయొచ్చుకదా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బన్నీ స్పందిస్తూ, “ఆయన మా జనరేషన్‌లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్” అని చెప్పాడు. దానికి బాలయ్య, “ఈ ప్రాజెక్ట్ కోసం ఎవ్వరూ కథ సిద్ధం చేయకపోతే నేనే రాస్తా, డైరెక్షన్ చేసే ధైర్యం లేకపోతే నేనే తీస్తా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఈ క్రేజీ కాంబోపై చర్చ మొదలైంది. ఇప్పటికే ఐదు నెలలు గడిచినా, ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మల్టీస్టారర్ మూవీగా రణ్‌బీర్ – బన్నీ కాంబో నిజమైనా, బాలయ్య మళ్లీ స్పందిస్తారో, బన్నీ ఏదైనా క్లారిటీ ఇస్తారో చూడాలి.
Recent Random Post:















