నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న గత ఏడాది వరుసగా భారీ బ్లాక్‌బస్టర్లు అందిస్తూ తన కెరీర్‌లో కొత్త రికార్డులను సృష్టించుకుంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
ఈ విజయాన్ని కొనసాగిస్తూ రష్మిక నటించిన చావా కూడా రూ.800 కోట్ల వసూళ్లతో దేశ వ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా శంభాజీ జీవితంపై ఆధారపడి, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది. రష్మిక కెరీర్‌లో ఈ రెండు పాన్ ఇండియా విజయాలు మహా మైలురాళ్లే.
అయితే, సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సింకిందర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయింది.
ఇదీ 2025లో రష్మిక నాలుగు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా కుబేర సినిమా జూన్ 20న పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
తర్వాత రష్మిక మరో భారీ ప్రాజెక్ట్ థామ లో నటిస్తోంది. మడోక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. ఆదిత్య సర్పోట్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దీపావళి పండుగకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ముందు వచ్చిన స్త్రీ 2 మరియు ముంజ్యా వంటి హారర్-కామెడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. కానీ థామ మాత్రం హారర్ అంశాలకంటే అతీంద్రియ శక్తులపై ఆధారపడి రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. అందువల్ల ప్రేక్షకులను ఎంత మేర ఆకర్షించగలదో ఆసక్తికరంగా ఉంది.
ఈ ఏడాది కుబేర మరియు థామతో రష్మిక మళ్లీ తన మ్యాజిక్ చూపించగలదా? అన్నది ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Recent Random Post: