రాజమౌళి ఒక్కసారి కమిటైతే..!

Share


రాజమౌళితో సినిమా అంటే ఎప్పుడూ అనుకున్నదానికన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంది. సాధారణంగా 3 సంవత్సరాలు చిత్తుగా పనిచేసి సినిమా పూర్తిచేయడం, అలాగే రెండు భాగాల సినిమాలు అయితే 5 సంవత్సరాలు కనీసం పట్టడం తప్పనిసరి. అలాగే, సినిమా షూటింగ్ కోసం రాజమౌళి ఎక్కడైనా వెళ్లాలి అంటే ఫ్యామిలీతో కూడా పర్మిషన్ తీసుకుని వెళ్లాలి.

ఆర్.ఆర్.ఆర్. తర్వాత, రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో మహేష్, ప్రియాంక పై కొన్ని సీన్లు చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాలో రాజమౌళి జట్టు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి శెడ్యూల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని, టైమ్ వృధా అవకుండా, సినిమా షూటింగ్ జాగ్రత్తగా జరుగుతోందని సమాచారం. ఈ సినిమా కోసం అతడు కాశి మణికర్ణిక ఘాట్ సెట్ ని ఆర్.ఎఫ్.సీ లో సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. మరి, ఫారెస్ట్ సీన్స్ ఆఫ్రికాలోనే ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.

ఇటీవల, రాజమౌళి మరియు టీమ్ త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించి, SSMB 29 సినిమా యొక్క పూర్తి కాస్ట్ మరియు క్రూ ని ప్రకటించనున్నారని సమాచారం. ప్రెస్ మీట్ తేదీ మాత్రం ఇంకా ఖచ్చితంగా తెలియడం లేదు.

రాజమౌళి, బాహుబలి మరియు RRR లాంటి ప్రాజెక్ట్స్ 3 సంవత్సరాల వరకు పడుతూ ఉంటే, మహేష్ బాబు సినిమా 1.5 సంవత్సరాలలో పూర్తి చేసి 2027 రెండవ హాఫ్ లో రిలీజ్ చేయాలని సంకల్పించాడు. మహేష్ కూడా ఈ నిర్ణయానికి పూర్తి సహకారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 2027లో సినిమాని విడుదల చేస్తే రికార్డ్ అవుతుందని భావిస్తున్నారు.

అయితే, సినిమా 2028లో విడుదల అయినా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఆనందంతో ఉంటారని అభిప్రాయపడుతున్నారు. SSMB 29 సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్‌మెంట్ పెరిగింది. మహేష్ లుక్, క్యారెక్టర్ హాలీవుడ్ హీరోలను తలపిస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.

RRR సినిమాతో ఒకే ఒక్క సాంగ్ తో అకాడమీ అవార్డును అందుకున్న రాజమౌళి ఈ సినిమాకు కనీసం మూడు నాలుగు కేటగిరిల్లో నామినేట్ అయ్యి ఆస్కార్ టార్గెట్ తో వస్తారని సమాచారం. రాజమౌళి సినిమా ఎప్పుడైతే మొదలు పెట్టినా, ఈ ప్రాజెక్ట్ పై ఎలా ప్రమోషన్లు చేయాలో, ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం గురించి సరిగ్గా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మహేష్ 29 సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు, వారి ఆనందం ఆకాశాన్నంటుతోంది.


Recent Random Post: