రిచెస్ట్ స్టార్స్: ఆ ముగ్గురి నిక‌ర‌ ఆస్తి 14000 కోట్లు

Share


భారతదేశంలోని ముగ్గురు అత్యంత ధనిక స్టార్లు ఒకే వేదికపై కలుసుకున్నారు. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతూ బాక్సాఫీస్‌ను శాసించిన ఈ ముగ్గురు స్టార్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంది. క్లాసిక్ హిట్‌లతో సినీప్రేక్షకులను అలరించిన కింగ్ ఖాన్ షారుఖ్, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, మేటి కథానాయిక జూహీ చావ్లా ఇప్పుడు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ముగ్గురూ కలిసి సరదాగా గడిపిన అరుదైన క్షణాలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ ముగ్గురి ఆస్తి, వ్యాపారాల్లో అనుభవాన్ని ఫోర్బ్స్, హురూన్ వంటి సంస్థలు గతంలో అధ్యయనం చేశాయి. తాజా అంచనాల ప్రకారం, షారుఖ్ ఖాన్ నికర ఆస్తి విలువ సుమారు ₹7,300 కోట్లు, జూహీ చావ్లా సుమారు ₹4,600 కోట్లు, ఆమీర్ ఖాన్ సుమారు ₹1,900 కోట్లు. మొత్తంగా ఈ ముగ్గురు కలిపి దాదాపు ₹13,800 కోట్ల ఆస్తులకు అధిపతులు.

ఈ స్టార్‌లను కలిపిన వేదిక లవ్ యాపా ప్రివ్యూ షో. ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, ఖుషి కపూర్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీని షారుఖ్, జూహీ, ఆమీర్ కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జూహీ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తూ – “ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం” అని భావోద్వేగంగా స్పందించారు. ముఖ్యంగా ఆమె షారుఖ్, ఆమీర్‌ల మధ్య నిలబడి ఉన్న ఫోటో అభిమానులను విపరీతంగా ఆకర్షించింది.

జూహీ చావ్లా, షారుఖ్ ఖాన్ కలిసి ఐపీఎల్ ఫ్రాంచైజీ సహా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఒకప్పటి ఆన్-స్క్రీన్ జోడీ, రియల్ లైఫ్‌లోనూ మంచి వ్యాపార భాగస్వాములయ్యారు. షారుఖ్‌తో జూహీ డర్, డూప్లికేట్, యస్ బాస్, రామ్ జానే, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ వంటి హిట్ సినిమాల్లో నటించగా, ఆమీర్‌తో కయామత్ సే ఖయామత్ తక్, ఇష్క్, హమ్ హై రహీ ప్యార్ కే వంటి క్లాసిక్ మూవీస్ చేశారు. వారి కెమిస్ట్రీ ఇప్పటికీ అభిమానుల్లో నostalజియాను కలిగించేలా ఉంటుంది.


Recent Random Post: