
ఒకవైపు సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్‌తో మంత్రముగ్ధులను చేస్తున్న హీరోయిన్లు ఇప్పుడు ట్రెండ్‌గా మారారు. సరికొత్త అవుట్‌ఫిట్స్‌తో ముందుకు రావడమే కాకుండా, ఆ దుస్తుల్లో తమ అందాన్ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు.
అలాంటి యంగ్ బ్యూటీల్లో రుక్మిణి వసంత్ కూడా ఒకరు. తన సహజమైన అందం, నటన, హుందాతనంతో మొదటి నుంచే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా కాంతార 2లో నటించి పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో హీరో రిషబ్ శెట్టిని కూడా తన నటనతో డామినేట్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.
ప్రస్తుతం రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడినప్పటికీ, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. రెడ్ కలర్ డ్రెస్‌లో కుర్చీలో కూర్చుని హుందాగా పోజులు ఇస్తూ తన అందాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేసింది. ఆమె చూపులు, అవుట్‌ఫిట్, ఎలిగెన్స్ చూసి అభిమానులు కవిత్వాలు వల్లిస్తున్నారు. రుక్మిణి వసంత్ తన స్టైల్‌తో మరోసారి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది.
2019లో విడుదలైన కన్నడ చిత్రం బీర్బల్తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన రుక్మిణి, 2023లో వచ్చిన కన్నడ రొమాంటిక్ డ్రామా సప్త సాగర దాచే ఎల్లోతో కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఈ సినిమాకు గానూ ఆమెకు కన్నడలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు లభించడం విశేషం.
తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో నిఖిల్‌తో పాటు రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఆ తర్వాత తమిళంలో శివకార్తికేయన్ సరసన మదరాసి సినిమాలో నటించినా, అది కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది. అయితే కాంతార: చాప్టర్ 1లో కనకావతి పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు అసలైన బ్రేక్ వచ్చింది.
ప్రస్తుతం రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ సినిమాతో పాటు టాక్సిక్ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనుండగా, వెంకట్ కే. నారాయణ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
Recent Random Post:















