
విజయ్ దేవరకొండ తన కెరీర్‌ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. లైగర్ డిజాస్టర్ అనంతరం, విజయ్ తన సినిమా లైనప్‌ను పూర్తి స్పష్టతతో రీ-అరేంజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కింగ్‌డమ్ అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్న విజయ్, చివరి షెడ్యూల్‌ను వేగంగా పూర్తి చేసేందుకు జోరుగా పని చేస్తున్నాడు.
కింగ్‌డమ్ పూర్తయిన వెంటనే, విజయ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందనున్న పీరియాడిక్ మూవీ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం.
ఇక విజయ్ దిల్ రాజు బ్యానర్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఫ్యామిలీ స్టార్ సమయంలోనే దిల్ రాజు నుంచి అడ్వాన్స్ తీసుకున్న విజయ్, తప్పకుండా మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌కు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ తన లైనప్‌లో మేజర్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
విజయ్ ఇటీవల బాలీవుడ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడని సమాచారం. కిల్ ఫేమ్ నిఖిల్ నాగేశ్ భట్ చెప్పిన కథ విజయ్‌ను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ముంబైలో ప్రధానంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా పూర్తయ్యాకే విజయ్ రవి కిరణ్ కోలా ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్ తన కెరీర్‌ను మరింత స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. కింగ్‌డమ్, రాహుల్ సంకృత్యాన్ పీరియాడిక్ మూవీ, బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్, ఆ తర్వాత రవి కిరణ్ కోలా సినిమా… ఇలా వరుసగా నాలుగు ప్రాజెక్ట్‌లతో విజయ్ బిజీ కానున్నాడు. ఈ లైనప్‌తో రౌడీ స్టార్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Recent Random Post:















