హిట్ 4 హీరో ఎవరు? కార్తీనా.. దుల్కరా?

Share


నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న హిట్: ది థర్డ్ కేస్ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఇంకో నెల రోజుల్లో ఈ థ్రిల్లింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిట్ 2 రిలీజ్‌ నుంచి చాలా గ్యాప్ వచ్చినా, హిట్ 3 పై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మేకర్స్ పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా, ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం పెరుగుతున్నాయి.

అయితే, ఇప్పుడే హిట్ 4 గురించిన ఆసక్తికర చర్చ మొదలైంది! హిట్ 3 క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా? హిట్ ఫ్రాంచైజీలో తదుపరి పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎవరు పోషించబోతున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి.

ఇప్పటికే కోలీవుడ్ స్టార్ కార్తీ, మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ పేర్లు తెరపైకి వచ్చాయి. కొందరు కార్తీ ఉంటాడని, మరికొందరు దుల్కర్ పేరు తీసుకొస్తున్నారు. హిట్ 3 క్లైమాక్స్‌లో నాని తరహాలో కార్తీ ఎంట్రీ ఇస్తాడని టాక్ ఉంది. మరోవైపు, ఈ ఫ్రాంచైజీకి దుల్కర్ సల్మాన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతాడని భావిస్తున్నవాళ్లూ ఉన్నారు.

కార్తీ ఇప్పటికే కాఖీ, సర్దార్ లాంటి పోలీస్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ చిత్రాల్లో తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అదే సమయంలో, దుల్కర్ సల్మాన్ కూడా విభిన్న పాత్రల్లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. హిట్ 4 లో ఎవరు హీరోగా వస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి! 🚔🔥


Recent Random Post: