అల్లు అర్జున్ స్పీడ్ మోడ్: బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్ట్స్!

Share


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ‘పుష్ప 2’తో మరో లెవల్‌కి వెళ్లిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1800 కోట్ల గ్రాస్ వసూలు చేసి, బన్నీకి పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను మరింత బలపరిచింది. అయితే, ఈ రెండు భాగాల ‘పుష్ప’ కోసం బన్నీ దాదాపు ఐదేళ్లు వెచ్చించాల్సి వచ్చింది. ఇది స్టార్ హీరోగా ఉన్న సమయంలో చాలా ఎక్కువ సమయం. ఇప్పుడు అదే గ్యాప్‌ను కవర్ చేయడానికి బన్నీ ఫుల్ స్పీడ్ మోడ్‌లోకి మారిపోయారు.

‘పుష్ప 2’ విజయం ఇచ్చిన మాస్ ఇమేజ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని బన్నీ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా, తన తదుపరి సినిమాలకు క్లియర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. అట్లీ దర్శకత్వంలో ఓ హై ఓక్టేన్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తి స్థాయి మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందనున్న చిత్రమని తెలుస్తోంది.

ఇదే సమయంలో, త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాకు బన్నీ సైన్ చేసినట్లు నిర్మాత నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. “అల్లు అర్జున్ గారు ఒకేసారి రెండు సినిమాలను చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మేము మా షూటింగ్ షెడ్యూల్‌ను కూడా ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. త్రివిక్రమ్ గారి సినిమా 2025 ద్వితీయార్థంలో ప్రారంభం అవుతుంది” అని పేర్కొన్నారు. అంటే, అట్లీ సినిమా షూటింగ్ జరుగుతూనే త్రివిక్రమ్ మూవీ సెట్స్‌పైకి వెళ్ళనుంది.

గతంలో చేసిన తప్పును మళ్లీ చేయకుండా, మార్కెట్‌ను పూర్తిగా క్యాష్ చేసుకునే వ్యూహంతో బన్నీ ముందుకు సాగుతున్నారు. స్టార్ హీరోగా ఉన్న సమయంలో వరుస సినిమాలు చేయడం, మార్కెట్‌ను మరింత పెంచుకోవడం ఇప్పుడు అతనికి అత్యవసరం. ‘పుష్ప 2’తో వచ్చిన మ్యానరిజమ్, క్రేజ్‌ను కాపాడుకోవాలంటే కంటిన్యూస్‌గా సినిమాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉండగా, అట్లీ సినిమా కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉంది.

ఈ రెండు ప్రాజెక్టులు 2025లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయితే, బన్నీని మరింత పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టే అవకాశం ఉంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ వర్క్ చేయాల్సిన ప్రెజర్ ఉన్నప్పటికీ, ఈ వ్యూహంతో బన్నీ మార్కెట్ రేంజ్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి!


Recent Random Post: