
లూసిఫర్ సీక్వెల్ “ఎంపురాన్” విడుదలైనప్పటి నుండి వివాదాల మధ్య నడుస్తూనే ఉంది. భారీగా ఇరవై కత్తిరింపులు, రెండు నిమిషాల ఫుటేజ్ డిలీట్ చేసిన కొత్త వెర్షన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో బిగ్ హిట్ అయినప్పటికీ, ఇతర భాషల్లో డిజాస్టర్ అయ్యింది. తెలుగు, హిందీ, తమిళ ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజుకు లాభాలు వచ్చేలా లేవు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయినా కూడా పృథ్విరాజ్ సుకుమారన్ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు “ఎల్3: ది బిగినింగ్” ను అధికారికంగా ప్రకటించబోతున్నాడు. ఈసారి కథ 1982 కాలానికి వెళ్తుంది, స్టీఫెన్ నెడుంపల్లి (లూసిఫర్) ముంబైలో ఎలా ఎదిగాడు? అనే దానిపై స్టోరీ ఫోకస్ అవుతుంది.
హీరోగా మోహన్ లాల్ కాదు, అతని కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ కనిపించబోతున్నాడు. “ఎల్2” చివర్లో రక్తంతో ఉన్న యువకుడు ప్రణవ్ నే అని కన్‌ఫర్మ్ అయింది. అయితే, ఎల్3లో కేవలం కొద్దిసేపు మాత్రమే మోహన్ లాల్ ఉంటాడట. ఫ్లాష్‌బ్యాక్‌లో తండ్రి పాత్రను కొడుకు పోషించడం కొత్తేమీ కాదు. గతంలో “గాయత్రి” సినిమాలో మోహన్ బాబు, మంచు విష్ణు చేసిన ఈ ప్రయోగం, పెద్దగా పనిచేయలేదు.
ముఖ్యంగా, ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రణవ్ ఒకే ఫ్రేమ్‌లో ఉండే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అంతే కాదు, “ఎల్3: ది బిగినింగ్” తర్వాత “ఎల్4: ది కంక్లూజన్” తో ఈ సిరీస్ ముగుస్తుందట!”
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉన్నాయో.. పృథ్విరాజ్ మాత్రమే చెప్పగలడు! 🔥🎬
Recent Random Post:














