
మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భక్త కన్నప్ప వంటి క్లాసిక్‌ను నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో మోహన్ బాబు, విష్ణు దీర్ఘకాలంగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. ఎట్టకేలకు, గత ఏడాది సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది.
ప్రస్తుతం, ఈ భారీ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రమోట్ చేస్తోంది టీం. ఈ క్రమంలో ముంబయిలో ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివుడి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివుడి పాత్ర కోసం మొదట విష్ణు, మోహన్ బాబు సంప్రదించినప్పుడు తాను అంగీకరించలేదని, అప్పట్లో బిజీగా ఉండటం వల్ల స్పందించలేకపోయానని అక్షయ్ చెప్పాడు. అయితే, అనంతరం విష్ణు-మోహన్ బాబు నేరుగా తన ఆఫీసుకు వచ్చి సినిమా గురించి వివరించారని, విష్ణు నిజాయితీ, కథపై ఉన్న కమిట్‌మెంట్ నచ్చి తాను *’కన్నప్ప’*లో నటించేందుకు ఓకే చెప్పినట్లు అక్షయ్ వెల్లడించాడు.
ఇక విష్ణు మాట్లాడుతూ, “ఈ తరానికి శివుడి పాత్రకు సరిపోయే నటుడు అక్షయ్ కుమారే. అందుకే ఆయనను ఒప్పించేందుకు మేము ఎంతగానో కృషి చేశాం. ఆయన లాంటి పెద్ద స్టార్ మా సినిమాలో నటించడమే గొప్ప విషయం. ఇది మా తండ్రి మోహన్ బాబు గారి వ్యక్తిగత రాబందాన్నే కాదు, ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్న స్థాయిని కూడా ప్రతిబింబిస్తుంది” అని చెప్పుకొచ్చాడు.
అలాగే, ఈ సినిమాతో తన వ్యక్తిత్వంలో అనేక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం ఆలోచనా విధానంలో ఉన్నతత స్థాయికి చేరుకున్నట్లు విష్ణు పేర్కొన్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యాస్ట్‌తో రూపొందుతున్న ‘కన్నప్ప’ ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు.
ఏప్రిల్ 25న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పౌరాణిక చిత్రం, కచ్చితంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని మూవీ టీం వ్యక్తం చేసింది.
Recent Random Post:















