జక్కన్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ రూల్స్‌తో ఇండస్ట్రీ షాక్!

Share


‘బాహుబలి’, ‘RRR’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘SSMB29’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అనౌన్స్ అయిన రోజు నుంచే ప్రతి అప్‌డేట్ ఇండస్ట్రీలో హీట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్గెస్ట్ ఈవెంట్ “గ్లోబ్ ట్రాటర్” నవంబర్ 15న జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కోసం జక్కన్న పెట్టిన రూల్స్ మాత్రం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవలే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ఉన్న విలన్ ‘కుంభ’ (పృథ్వీరాజ్ సుకుమారన్) లుక్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత చీర కట్టి గన్ పట్టిన పవర్‌ఫుల్ ఫీమేల్ లీడ్ ‘మందాకిని’ (ప్రియాంక చోప్రా) లుక్‌తో మరింత కుతూహలం పెంచాడు. కానీ అసలైన హీరో మహేష్ బాబు ఫస్ట్ లుక్ మాత్రం జక్కన్న గ్రాండ్ ఈవెంట్ వరకు దాచిపెట్టాడు.

ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా సెట్ నిర్మిస్తున్నారు. అయితే నిజమైన థ్రిల్ జక్కన్న పెట్టిన సెక్యూరిటీ రూల్స్‌లోనే ఉంది. ఈ ఈవెంట్‌కు మీడియా కెమెరాలకు ఎంట్రీ లేదు, అంతేకాదు జర్నలిస్టులు కూడా తమ మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేయాలన్న షరతు పెట్టడం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌లోకి నెట్టింది. మహేష్ లుక్ లీక్ కాకుండా, ప్రేక్షకులు థియేట్రికల్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను మాత్రమే అనుభవించాలన్నది జక్కన్న మాస్టర్ ప్లాన్.

ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులు హాట్‌స్టార్‌కి ఇప్పటికే ఇచ్చారు. అందుకే బయటకు ఒక్క ఫోటో కూడా రానీయకుండా ఈ రూల్స్ పెట్టారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్‌కి కూడా మొబైల్ డిపాజిట్ రూల్ అమలు చేస్తే, అది భారత సినీ చరిత్రలోనే సంచలన నిర్ణయంగా నిలుస్తుంది.

ఈవెంట్ హోస్టింగ్ బాధ్యతలను సుమ కనకాల మరియు యూట్యూబ్ కింగ్ ఆశిష్ చంచలానీకి అప్పగించారు. తెలుగు ప్రేక్షకుల పల్స్‌కి దగ్గరగా ఉన్న సుమ, నార్త్ యువతలో పాపులర్ అయిన ఆశిష్ కలిసి ఈ స్టేజ్‌ను ఎనర్జీతో నింపబోతున్నారు.
ఏం చేసినా, రాజమౌళి ప్లాన్ చేసిన “గ్లోబ్ ట్రాటర్” ఈవెంట్‌పై హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌కు చేరింది.


Recent Random Post: