
బాలీవుడ్లో తగ్గిన అవకాశాల తర్వాత, ప్రియాంకా చోప్రా ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్టులు పట్టేస్తుండటం ఆసక్తికరంగా మారింది. మొదటగా, మహేష్ బాబు – రాజమౌళి పాన్-వరల్డ్ సినిమాలో చోటు దక్కించుకుంది. ఇందులో ఆమె హీరోయిన్గా నటిస్తున్నదా, లేక ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనుందా అనే విషయంపై స్పష్టత రాలేదు. కానీ, లీక్స్ ప్రకారం మహేష్ సరసన హీరోయిన్ కాదు అని అంటున్నారు. ఇటీవలే కేరళ, హైదరాబాద్ షెడ్యూల్లో పాల్గొన్న ప్రియాంకా తన కీలక సన్నివేశాలను పూర్తి చేసింది.
ఇదిలా ఉండగా, ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు కూడా ప్రియాంకాను సంప్రదించారని టాక్. బన్నీతో జోడీగా నటించేందుకు లేదా మరేదైనా పాత్ర కోసం ఆమెను అడిగారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇది గాసిప్ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎన్నాళ్లుగానో టాలీవుడ్‌కు దూరమైన ఈ సీనియర్ హీరోయిన్‌కు మళ్లీ దర్శకులు క్యూ కడతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలుగులో ప్రియాంకా గతంలో కేవలం రామ్ చరణ్‌తో ‘తుఫాన్’ (జంజీర్) సినిమాలో నటించింది. అయితే, ఆ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. అయితే, ఆమెకు హాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో ఆమె గ్లోబల్ స్టార్‌గా మారింది. ప్రస్తుతం ముంబైలో ఉంటూ, రాజమౌళి పిలిస్తే షూటింగ్లో పాల్గొంటోంది.
ఈ కొత్త అవకాశాలతో ప్రియాంకా చోప్రా టాలీవుడ్లో తిరిగి వెలుగులోకి వస్తుందా? మహేష్, అల్లు అర్జున్ సినిమాలతో ఆమె కెరీర్లో కొత్త మలుపు తిరుగుతుందా? చూడాలి!
Recent Random Post:














