తెలుగమ్మాయిలకు తక్కువ అవకాశాలపై అనన్య ఆవేదన

Share


టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు రాకపోవడంపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఇతర భాషల నుండి వచ్చే హీరోయిన్స్‌కు మాత్రం మంచి అవకాశాలు లభిస్తుండగా, మన తెలుగు అమ్మాయిలని పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశాన్ని హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి ప్రస్తావించారు.

‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన అనన్య నాగళ్ల ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అమ్మాయి. కొంత కాలంగా హీరోయిన్‌గా రాణించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు రాక ఆమె నిరాశ వ్యక్తం చేశారు. రీసెంట్‌గా వెన్నెల కిషోర్‌తో కలిసి ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో నటించిన అనన్య, ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ టాలీవుడ్‌లోని పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు 20 శాతం మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. మిగతా 80 శాతం అవకాశాలు ఇతర భాషలకు చెందిన హీరోయిన్స్‌కే దక్కుతున్నాయి. భారత్‌లోని ఇతర రాష్ట్రాల్లో అమ్మాయిలకే నటనపై ఆసక్తి ఉంటే అవకాశాలు ఉంటాయి, కానీ తెలుగులో మాత్రం మనకే 20 శాతం అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి” అని అనన్య చెప్పారు.

తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలకూ ప్రయత్నిస్తే కూడా తెలుగమ్మాయిలకే ఇలాంటి పరిస్థితే ఉంటుందని అనన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, తెలుగు హీరోయిన్‌ల పరిస్థితిని మళ్లీ చర్చనీయాంశం చేశాయి.


Recent Random Post: