
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన బైకర్ సినిమా తొలుత డిసెంబర్ మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్న ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు.
ఇక మరోవైపు, శర్వానంద్ నటిస్తున్న నారి నారి నడుమ మురారి సినిమాను మాత్రం సంక్రాంతి కానుకగా జనవరిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్‌గా సూటయ్యే సినిమా ఇదేనని టీమ్ బలంగా నమ్ముతోంది.
సామజవరగమనతో సూపర్ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డబుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన నారి నారి నడుమ మురారి ఫన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తుందని చెబుతున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా హిట్ అయితే, వాయిదా పడిన బైకర్ సినిమాకు కూడా మంచి బూస్ట్ లభిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల శర్వానంద్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. చివరిగా వచ్చిన మనమే కూడా నిరాశపరిచింది. అందుకే ఈసారి రెండు పూర్తిగా డిఫరెంట్ జానర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి శర్వానంద్ ప్లాన్ చేస్తున్నాడు. నారి నారి హిట్ అయితే కచ్చితంగా బైకర్ పై అంచనాలు పెరుగుతాయని చెప్పొచ్చు.
బైకర్ విషయానికి వస్తే, తెలుగు తెరపై ప్రొఫెషనల్ బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే. ప్రేక్షకులకు కంప్లీట్ బైక్ రేసింగ్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
నిజానికి నారి నారి నడుమ మురారి కంటే ముందే బైకర్ రిలీజ్ కావాల్సి ఉన్నా, ఇప్పుడు పరిస్థితులు మారాయి. నారి నారి ప్రేక్షకులను కనెక్ట్ అయితే, ఆ ప్రభావం నేరుగా బైకర్ పై పడే అవకాశం ఉంది.
ఈ రెండు సినిమాలపైనా శర్వానంద్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ దశలో, ఈ రెండు చిత్రాలు అతనికి మళ్లీ జోష్ తీసుకురాగలవా అన్నది చూడాలి. రెండు భిన్నమైన కథలు, రెండు వేరు వేరు క్యారెక్టరైజేషన్స్‌తో శర్వానంద్ తనలోని వేరియేషన్స్ చూపించబోతున్నాడు.
నారి నారిలో ఫ్యామిలీ హీరోగా, బైకర్లో మాత్రం మేకోవర్, రియల్ స్టంట్స్‌తో సర్‌ప్రైజ్ చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
Recent Random Post:















