నిఖిల్ కెరీర్‌ని మళ్లీ నిలబెట్టే ప్రయత్నంలో స్వయంభు

Share


‘కార్తికేయ 2’ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఆ క్రేజ్‌ను కొనసాగించేందుకు వరుస సినిమాలు ఒప్పుకున్నాడు. అయితే ‘స్పై’, ’18 పేజెస్’ సినిమాలు అంచనాలను అందుకోకపోవడంతో, నిఖిల్ మార్కెట్ కొంత తగ్గింది. ఆ పరిస్థితిని మార్చుకోవాలని ఇప్పుడు పూర్తి ఫోకస్‌ను తన కొత్త చిత్రం ‘స్వయంభు’పై పెట్టాడు.

పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నిఖిల్ పోరాట యోధుడిగా నటిస్తున్నారు. పాత్రకు తగిన ఫిట్‌నెస్ అందుకోవడానికి 8 నెలలు కఠినమైన డైట్‌తో పాటు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో పనిచేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమాన్ వద్ద 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

తాజాగా ‘స్వయంభు’ షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. కేవలం ఒక రోజుకి మాత్రమే పెండింగ్ ఉందని సమాచారం. రాజేంద్రప్రసాద్ డేట్స్ లభించగానే ఆ చివరి పార్ట్ కూడా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటమే కాక, సీజీ, వీఎఫ్ఎక్స్‌ పార్ట్ ఎక్కువగా ఉండటంతో విడుదలకు కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో నిఖిల్ పెట్టుకున్న ఈ ప్రయత్నం ఫలిస్తే, మళ్లీ తన స్థాయిని పెంచుకునే అవకాశం ఉన్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.


Recent Random Post: