టాలీవుడ్ పవన్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటే, ఆయన ఉన్నతమైన మానవతావాదిని అని అనేక సందర్భాల్లో నిరూపించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులకు పవన్ గతంలో అనేక సార్లు ఆపన్న హస్తం అందించేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం చేసి వారికి అండగా నిలిచారు. తాజాగా, పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సాయం చేసి మరింత మంది హృదయాలను గెలుచుకున్నారు.
ఫిష్ వెంకట్, కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు అధిక షుగర్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ తనకు చేసిన సాయాన్ని వివరించారు. ఆయన చెప్పారు, “కొంతకాలం క్రితం నా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, ఇక రోజు మార్చి రోజు డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఈ కారణంగా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను మరియు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.”
తన భార్య సువర్ణ ఒత్తిడి పెట్టడంతో పవన్ కళ్యాణ్ ను కలిశానని, ఆయన తనకు భరోసా ఇచ్చి అన్ని విధాలా సాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. వెంటనే తన బ్యాంకు ఖాతాలో రూ. 2 లక్షలు జమ చేయించారని, ఆర్థిక కష్టాలు విన్న పవన్ కళ్యాణ్ వారి బాధను అర్థం చేసుకుని చలించిపోయారని వెంకట్ అన్నారు.
పవన్ కళ్యాణ్, తన కిడ్నీ చికిత్సకు కూడా సాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఈ కష్ట సమయంలో పవన్ తనకు దేవుడిగా కనిపించారని భావోద్వేగానికి గురైన వెంకట్ అన్నారు. వీడియోలో, ఫిష్ వెంకట్ పవన్ కళ్యాణ్ స్టైల్లో న్యూ ఇయర్ విషెస్ చెప్పగా, ఆ వీడియో పవన్ అభిమానుల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడింది మరియు వైరల్ అయ్యింది.
Recent Random Post: