
సూర్య, కోలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సాధించిన హీరో. వివాదాలకు దూరంగా ఉండి, విభిన్నమైన పాత్రలతో కెరీర్‌ను సాగిస్తున్న సూర్య, ఇటీవలే ‘కంగువా’ సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, సూర్య తాజాగా కొత్త ప్రాజెక్టులతో మరింత ఉత్సాహంగా సినిమాలలో నటిస్తున్నారు.
ప్రస్తుతం, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘రెట్రో’ చిత్రంలో నటిస్తుండగా, ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్, అలాగే వెట్టరిమారన్ దర్శకత్వంలో ‘వడివాసల్’ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ దశల్లో ఉన్నాయి.
ఈ చిత్రాలలో, ‘రెట్రో’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 1న తమిళతో పాటు తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను పూజా హెగ్డే ఈ మధ్యనే ప్రారంభించారు. ఈ సందర్భంగా, పూజా సూర్య కళ్ళలోని మ్యాజిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూజా హెగ్డే మాట్లాడుతూ, “సూర్య కళ్ళలో ఏదో సూపర్ పవర్ ఉంది. ఆయన కళ్లలో వెయ్యికి పైగా ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ కొన్ని సార్లు చాలా ఈజీగా ఉంటుంది. ఆయన ప్రతి షాట్‌లో ఒరిజినల్‌గా, నిజాయితీగా నటిస్తారు. అది మా కోసం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆయన ఆ రహస్యం చెప్పలేదు, కానీ నేను సూర్యని అడిగినప్పుడు ఆయన కళ్లతో ఎలా మ్యాజిక్ చేస్తున్నారో నాకు చెప్పలేదు” అని చెప్పారు.
Recent Random Post:















