పూరి మౌనం.. వేవ్స్ 2025పై స్పందించకపోవడం చర్చకు దారి

Share


ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల ప్రతినిధులు పాల్గొన్న వేవ్స్ 2025 సదస్సు, నూతన ఆవిష్కరణలకు వేదికగా మారింది. కానీ ఈ ప్ర‌తిష్టాత్మ‌క సదస్సుకు భారతదేశం, ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకాలేదన్నది ఆస‌క్తిక‌ర అంశంగా మారింది.

పరిశ్రమలో గొప్ప పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కూడా ఈ ఈవెంట్‌కు హాజరుకాలేదు. దీనిపై పూరి అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు, తన ‘పూరి మ్యూజింగ్స్’లో ఏ అంశమైనా స్పందించే పూరి, వేవ్స్ 2025 గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇటీవల తన పాడ్‌కాస్ట్‌లో పూరి మాట్లాడిన అంశాలు ఇప్పుడు ఈ నేప‌థ్యంలో మరింత ప్రాధాన్యం సంత‌రించుకుంటున్నాయి. “జీవితం అంటే విజయం సాధించడమే కాదు, ఆనందంగా ఉండడమే నిజమైన గెలుపు” అని చెప్పిన పూరి, బిలియ‌నీర్ల‌కంటే ఓ సాధార‌ణ మ‌నిషి ఆనందంగా జీవించ‌గ‌ల‌డ‌ని వివరించారు.

పని మీద ప్రేమ, సంతృప్తి, మానసిక ప్రశాంతతే జీవితాన్ని సంపూర్ణంగా మార్చే అంశాలని పూరి అభిప్రాయ‌ప‌డ్డారు. “ఒక తోటమాలి, టీచర్, లేదా చేపలు పట్టేవాడు – తాము చేసే పనిలో సంతృప్తి చెందతారు. నిజమైన బిలియనీర్ అంటే ఇదే!” అని పూరి స్పష్టంగా చెప్పారు.

వేవ్స్ 2025 పై ఇంకా స్పందించకపోయినా, పూరి జీవన తత్వం మాత్రం మిగిలిన సినీ ప్రముఖులకు ఒక గుర్తుగా నిలుస్తోంది.


Recent Random Post: