
నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గౌరవం నుంచి బడ్డీ వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. దాదాపు 13-15 ఏళ్ల సినీ ప్రయాణంలో నటుడిగా పెద్ద బ్రేక్ దక్కకపోయినా, అతని పట్టుదల మాత్రం తగ్గలేదు.
శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాలతో కొంత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా, స్టార్ హీరో రేసులో మాత్రం ఇంకా వెనుకబడిగానే ఉన్నాడు. హీరో పాత్రలతో పాటు కొన్ని కీలక పాత్రల్లోనూ మెప్పించినా, ఆ దిశగా కొనసాగించలేకపోయాడు.
ఇప్పుడు మగజాతి ఆణిముత్యం సినిమాపై శిరీష్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో అయినా తన కెరీర్ టర్నింగ్ పాయింట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇదే సమయంలో, నైనికా రెడ్డితో వివాహం కూడా అతని జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
పెళ్లి తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శిరీష్ చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. “ఇంతకుముందు ఒంటరిగా ఉన్నప్పుడు సంపాదనపై పెద్దగా ఒత్తిడి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కుటుంబ బాధ్యతలు పెరిగాయి. అందుకే కెరీర్‌పై మరింత కసి, ఫోకస్ పెరిగింది” అని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలతో శిరీష్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.
మరోవైపు, అతను కేవలం నటుడిగానే కొనసాగుతాడా? లేక తండ్రి లాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడతాడా? అన్న చర్చ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. గీతా ఆర్ట్స్, ఆహా ఓటీటీ, అలాగే తాజాగా ప్రారంభమైన అల్లు సినిమాస్ వంటి పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉండటంతో, భవిష్యత్తులో శిరీష్ నిర్మాతగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో ఆయన సరదాగా చెప్పిన “నేను రిటైర్ అయిపోయాను” అన్న మాటల వెనుక కూడా ఏదో సంకేతం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రానా దగ్గుబాటి తన కుటుంబ వారసత్వాన్ని నిర్మాతగా ముందుకు తీసుకెళ్తున్నట్లు, శిరీష్ కూడా అల్లు అరవింద్ వారసత్వాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మొత్తానికి, పెళ్లి తర్వాత వచ్చిన బాధ్యతలు, కొత్త ఆలోచనలు—ఈ రెండూ కలిసి శిరీష్ కెరీర్‌కు కొత్త దిశ చూపిస్తాయా లేదా అన్నది చూడాలి. ఈ సెకండ్ ఇన్నింగ్స్ అతనికి నిజమైన బ్రేక్ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:















