ప్రభాస్-సందీప్ వంగా స్పిరిట్: మాస్ ఫీస్ట్‌కు రెడీ!

Share


రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మాస్ ట్రీట్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్, ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో రాజా సాబ్తో theatersలో సందడి చేయనున్న ప్రభాస్, తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఫౌజీ సినిమా ని వచ్చే సమ్మర్‌కు రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు.

ఇక ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ స్పిరిట్, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనుంది. స్పిరిట్ పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రతి సినిమా హీరో పాత్రకు ప్రత్యేకమైన క్యారెక్టర్ ఆర్క్ డిజైన్ చేసే సందీప్ వంగా, స్పిరిట్ కోసం ప్రభాస్ లుక్, క్యారెక్టర్ రెండు కూడా డిఫరెంట్ గానే ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.

స్పిరిట్ కోసం రెబల్ స్టార్ మేకోవర్ కూడా సరికొత్తగా ఉండబోతుందట. షూటింగ్ మొదలైన తర్వాత పటాస్ లాంటి స్పీడ్‌తో పూర్తి చేయాలని సందీప్ వంగా నిర్ణయించుకున్నాడు. ప్రభాస్ డేట్స్ అందుబాటులో ఉంటే స్పిరిట్ మూవీని ఏడాది లోపు పూర్తి చేయాలని భావిస్తున్నాడట. అందులో భాగంగా 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో సినిమా విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ సినిమాలో యానిమల్ ఫేం త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించనున్నారు. మరోవైపు, సందీప్ వంగా సినిమాలంటేనే మాస్, వయలెన్స్‌కి కేరాఫ్ అడ్రస్. అలాంటిది బాహుబలి ప్రభాస్‌తో ఆయన చేస్తున్న స్పిరిట్ ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఒక ఇంటర్వ్యూలో “ప్రభాస్‌ని ఒక మాటలో వివరించమంటే?” అని అడిగితే, “అది స్పిరిట్లో చూపిస్తా” అని చెప్పడం విశేషం.


Recent Random Post: