మాస్ జాతర రిలీజ్ వాయిదా?

Share


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న మాస్ జాతర సినిమా గురించి సినీ వర్గాల్లో కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార నాగవంశీ నిర్మిస్తున్నారు. ధమాకా తర్వాత రవితేజ–శ్రీలీల జోడీ వస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

అసలైతే ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కారణం – ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం. అదికాక ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడంతో ఈ కొద్దికాలంలో రిలీజ్ చేయడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారని టాక్.

ఇక టీజర్‌లో రవితేజ ఎనర్జీ బాగానే ఉన్నప్పటికీ, పోలీస్ గెటప్‌లో విలన్లను చితకబాదటం, మాస్ డైలాగ్స్ చెప్పడం వంటి సీక్వెన్స్‌లు కొత్తగా అనిపించలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే సినిమాపై బజ్ కూడా తగ్గిందని అంటున్నారు.

మరోవైపు నిర్మాత నాగవంశీకి ఇటీవల కింగ్‌డమ్ ఫలితం పెద్ద షాక్ ఇచ్చింది. అదికాక ఆయన అంచనాలు పెట్టుకున్న వార్ 2 కూడా తెలుగులో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో కొంత టెన్షన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మాస్ జాతరను ఆగస్టు 27 నుంచి వాయిదా వేసి అక్టోబర్ రెండో భాగంలో లేదా నవంబర్‌లో విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే, రవితేజ అభిమానులకు మాత్రం ఇది నిరాశ కలిగించే వార్తే. ధమాకా తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజ్ ఈసారి ఎలాంటి జాతర చూపిస్తాడో చూడాలి.


Recent Random Post: