
ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్ రన్ ముగిసిన రెండు నుంచి నాలుగు వారాల మధ్యలోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్న రోజులివి. అయితే, ఏకంగా తొమ్మిది నెలల తర్వాత కూడా ఓ పేరున్న హీరో మూవీ ఓటీటీలో రాకపోవడం ఆశ్చర్యకరమే. ఆ పరిస్థితిని ఎదుర్కొన్న చిత్రం శర్వానంద్ – కృతి శెట్టి జంటగా నటించిన మనమే.
గత ఏడాది జూన్‌లో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, డిజిటల్ రిలీజ్ విషయంలో ఓటీటికి నడుం త్రొక్కింది. దీనికి కారణం థర్డ్ పార్టీ చేసిన మోసం అని, హక్కుల విషయంలో లీగల్ ఇష్యూస్ తలెత్తాయని నిర్మాత విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టు తెలుస్తోంది.
త్వరలోనే ‘మనమే’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కి సిద్ధమవుతోందని టాక్. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ, ఇప్పుడే వరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ వివాదం కారణంగా ‘మనమే’ ఇప్పటివరకు శాటిలైట్ ప్రీమియర్ కూడా జరగలేదు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చైల్డ్ సెంటిమెంట్ నేపథ్యంలో ఫన్ ఎంటర్టైనర్గా రూపొందింది. హేశమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రం, థియేటర్లలో ఊహించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. యావరేజ్ రేంజ్లో నిలిచినప్పటికీ, ఓటీటీలో ఇలాంటి కథలు మంచి రెస్పాన్స్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఎన్నో సినిమాలకు ఏ సమస్యా ఎదురుకాకపోగా, కేవలం మనమే మాత్రమే ఇలాంటి ఓటీటి చిక్కును ఎదుర్కొవడం. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన విషయం కావడంతో, ఫ్యాన్స్ చాలా కాలంగా నిరీక్షించాల్సి వచ్చింది.
ఈ ఉదంతం మిడిల్ మేనేజ్మెంట్ (మధ్యవర్తుల) వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే సందేశాన్నిచ్చినట్టైంది. ఎంత లేట్ అయినా, ఓటీటీలోకి వచ్చే సరికి మనమే కొత్త గానీ, పెద్ద రెస్పాన్స్ తెచ్చుకుంటుందా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇక, శర్వానంద్ కెరీర్ పరంగా చూస్తే, ‘మనమే’ తర్వాత ఇప్పటివరకు అతని కొత్త సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న నారి నారి నడుమ మురారి చివరి దశ షూటింగ్లో ఉంది. ఈ చిత్రం వేసవి విడుదలకు సిద్ధమవుతుండగా, విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Recent Random Post:














