
ప్యాన్ ఇండియా సినిమాలు తరచుగా ఆలస్యమవుతున్న ఈ రోజుల్లో, స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక్క సినిమానే రిలీజ్ చేయడానికే కష్టపడుతున్నారు. అయితే, ఏడు పదుల వయసులో కూడా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం తనదైన వేగంతో దూసుకుపోతున్నారు. కేవలం ఆరు నెలల్లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమాను కంప్లీట్ చేసిన తలైవా, ఇప్పుడు అదే స్పీడ్‌తో జైలర్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం జైలర్ 2 టీమ్ కేరళలోని అట్ఠపాడిలో భారీ సెట్లు నిర్మిస్తోంది. ఏప్రిల్ 10 నుంచి ఇక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. రజినీకాంత్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను కేవలం 15-20 రోజుల్లో పూర్తి చేసేందుకు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కీలక తారాగణం మొత్తం ఈ షెడ్యూల్లో పాల్గొననుంది. మండుటెండల్లో కూడా ఇంతటి పెద్ద షెడ్యూల్‌కు రజినీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా విశేషం.
తర్వాత, చిత్రీకరణ చెన్నైకి మారనుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు జైలర్ 2 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో ఉంది. అయితే, అదే సమయంలో విజయ్ చివరి సినిమా జన నాయగన్ విడుదల కానుండటంతో, రజినీ మార్చి రిలీజ్ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
ఈసారి జైలర్ 2 లో కొత్త విలన్లు, నటీనటులు చేరబోతున్నారు. బాలకృష్ణ స్పెషల్ క్యామియో చేయనున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అయితే, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ పాత్రలు కొనసాగనున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇకపై జైలర్ 2 గురించి మరిన్ని అప్డేట్స్ రాబోతుండగా, రజినీకాంత్ స్పీడు చూస్తుంటే సినిమా అతి తక్కువ సమయంలో పూర్తి కావడం ఖాయం.
Recent Random Post:















