రష్మిక, కృతి, షాహిద్ కపూర్ తో కాక్‌టెయిల్ 2

Share


బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనమైన సినిమా కాక్‌టెయిల్కు ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 పై సోషల్ మీడియాలో వందల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్రంలోని పాత్రలపై వచ్చే వార్తలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రచారం ప్రకారం, రష్మిక మందన్న మరియు కృతి సనన్ ఈ సినిమాలో స్వలింగ ప్రేమికులుగా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, రష్మిక కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ రోల్‌గా మారనుంది. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ సినిమాతోనే వస్తుండటంతో ప్రేక్షకుల అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగాయి.

సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యూరప్, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో షూటింగ్ పూర్తయి, మేకర్స్ ఈ మూవీని సెప్టెంబర్ 2026లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కృతి సనన్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయని, నేటి తరం ఆడియెన్స్ కోసం ఈ సినిమా డిజైన్ చేయబడ్డుందని చెప్పారు.

రష్మిక పాత్ర గురించి వచ్చే రూమర్స్ పై చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ బాలీవుడ్ పోర్టల్స్‌లో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. షాహిద్ కపూర్ పాత్ర కూడా సరికొత్తగా, విభిన్నంగా ఉండనున్నట్లు సమాచారం. డినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా కౌరియాసిటీ నెలకొంది. సెప్టెంబర్ రిలీజ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి, టీజర్ లేదా ట్రైలర్ ద్వారా రష్మిక క్యారెక్టర్‌పై సస్పెన్స్ వీడే అవకాశం ఉంది.

ఈ రూమర్స్ మాత్రమే ఇప్పటికే ఇంత బజ్ క్రియేట్ చేసిందంటే, సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఇంకా భారీగా ఉండనుందని ఊహించవచ్చు. రష్మిక ఈ బోల్డ్ స్టెప్ తీసుకుందో లేదో తెలిసుకోవడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Recent Random Post: