
తనతో కలిసి పనిచేసిన హీరోయిన్లలో తనకు నచ్చే క్వాలిటీస్ గురించి యువసామ్రాట్ నాగచైతన్య తనదైన శైలిలో వివరించాడు. తన కథానాయికలు కృతి శెట్టి – పూజా హెగ్డేతో పాటు సమంతలో తనకు నచ్చిన లక్షణాల గురించి నాగ చైతన్య మాట్లాడాడు. ముఖ్యంగా చై తన మాజీ భార్య సమంత గురించి చై అన్న మాటలు హృదయాల్ని హత్తుకుంటున్నాయి.
సమంత ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేసేస్తుందని చై ఈ ఇంటర్వ్యూలో కొనియాడాడు. మాజీ భార్య సమంతను ప్రశంసల్లో ముంచెత్తి అక్కినేని నాగచైతన్య తన గురించి చాలా విషయాలు చెప్పాడు. సమంత చాలా హార్డ్ వర్కర్ అని, విల్ పవర్ ఎక్కువ అని నాగ చైతన్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సమంతపై చైతూ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు సమంత మనసును తాకుతాయంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
నాగ చైతన్య హీరోగా నటించిన `ఏ మాయ చేసావే` సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సమంత. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ విభేధాలతో 2021లో విడాకులు తీసుకున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. చైతన్య కూడా ఇప్పుడు కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్నాడు. ఇటీవల సమంతా రొమాంటిక్ డ్రామా ఖుషీలో కనిపించింది. ట్యాలెంటెడ్ నటుడు విజయ్ దేవరకొండ సరసన సామ్ నటించింది. ఇది భార్యాభర్తల నడుమ గొడవల నేపథ్యంలో రూపొంది ఆకట్టుకుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం సమంత మైయోసైటిస్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. చైతూ సమంత కలిసి ఆటోనగర్ సూర్య (2014), మనం (2014), మజిలీ (2019) చిత్రాల్లో నటించారు.
=

`విశ్వరూపం` మొదటి భాగం తర్వాత కమల్ హాసన్ కి సరైన సక్సెస్ పడలేదు. చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. `విశ్వరూపం` ..`విక్రమ్` మధ్యలో ఆరేడు సినిమాలు చేసారు. అవన్నీ ఫలితాల పరంగా తీవ్ర నిరుత్సాహ పరిచినవే. అప్పటికే సొంత నిర్మాణంలో ప్రయోగాలు ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో `విక్రమ్` చిత్రాన్ని సొంత బ్యానర పై నిర్మించి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈసినిమా ఫలితం కమల్ ఆర్దిక కష్టాలన్నింటిని తీర్చేసింది. బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో అన్ని లెక్కలు సరిచేసారు. దీంతో ఉలగనాయగన్ రెట్టించిన ఉత్సాహంలో సొంత నిర్మాణ సంస్థలో వరుస పెట్టి ప్రాజెక్ట్ లు ప్రకటించారు. ఆయన బయట హీరోలతో నిర్మిస్తోన్న చిత్రాలు..తాను నటిస్తోన్న సినిమాల నెంబర్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న మూడు సినిమాల బడ్జెట్ మొత్తం 700 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనాగా తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో `ఇండియన్ -2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారతీయుడికి సీక్వెల్ గా కమల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అని తెలుస్తోంది. అలాగే ఖాకీ దర్శకుడు హెచ్. వినోధ్ తెరకెక్కిస్తున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమా కి కూడా 150 కోట్ల వరకూ ఖర్చు అవు తుందని అంచనా వేస్తున్నారు. ఇక మణిర త్నం దర్శకత్వంలో `థగ్ లైఫ్` అనే కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది భారీ కాన్వాస్ పై తెరకెక్కిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ తర్వాత మణిసార్ రూటు పూర్తిగా మార్చేసారు. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు. అలాంటి కంటెంట్ నే ఎంపిక చేసుకుంటున్నారు. ఈసినిమా బడ్జెట్ 300 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అంతకు పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గడానికి ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తోనే అంచనాలు తారా స్థాయికి చేరాయి. విక్రమ్ సక్సెస్ నేపత్యంలో ఈసినిమాలన్నీ ఎద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తాయి. హిట్ అయితే వసూళ్లు..లాభాలు అలాగే ఉంటాయి.