హరి హర వీరమల్లు ప్రీరిలీజ్‌కి జక్కన్న, త్రివిక్రమ్!

Share


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా పీరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’కి సంబంధించి చివరకు క్లారిటీ వచ్చింది. క్రిష్‌, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 17వ శతాబ్దం నేపథ్యంతో రూపొందుతోంది. మొఘల్ కాలం నేపథ్యంలో రాబిన్ హుడ్ తరహా యోధుడిగా పవన్ కనిపించనున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచాయి.

కొంతకాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్‌గా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌కు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా జక్కన్న రాజమౌళిని ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.

పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో చాలా కాలంగా సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ‘హరి హర వీరమల్లు’ పవన్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానుల్లో, ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇటీవలి ట్రైలర్‌తో మళ్లీ హైప్ వచ్చేసింది. పైగా, వరుసగా విడుదలైన పెద్ద సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు అందరి కళ్లూ ఈ మూవీపై నిలిశాయి.

ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి హాజరవుతారన్న వార్తతో పాటు, పవన్‌కు ఆత్మ సమానుడైన త్రివిక్రమ్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌తో ‘హరి హర వీరమల్లు’పై క్రేజ్ ఇంకొంత పెరిగేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Recent Random Post: