మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. అలాగే మరో ఆరుగురిని కమిషన్ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సభ్యులుగా నియమితులైనవారిలో షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, సుధం లక్ష్మి, కటారి రేవతీరావు, గద్దల పద్మ ఉన్నారు. వీరంతా ఐదేళ్లపాటు ఆయా పదవుల్లో ఉంటారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేకంగా మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా 2013లో త్రిపురాన వెంకటరత్నం నియమితులయ్యారు. ఆమె 2018 మార్చి వరకు పనిచేశారు. అయితే, 2014లో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడినా.. చాలాకాలంపాటు మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు. దీంతో రమ్యారావు అనే సామాజిక కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నవంబర్ 18లోగా మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయినప్పటికీ సర్కారు స్పందించలేదు. దీంతో సర్కారు వైఖరిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. డిసెంబర్ 31లోగా మహిళా కమిషన్ నియామకం జరగకపోతే సీఎస్ కోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సునీతా లక్ష్మారెడ్డిని చైర్ పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.


Recent Random Post: