జూనియర్‌ శ్రీదేవి ఆదాయం అంత ఉందా?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా సెటిల్‌ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా సఫలం అవ్వడం లేదు. అయినా కూడా హీరోయిన్‌ గా తన తల్లి రేంజ్‌ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరో మూడు చర్చల దశలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జూనియర్‌ శ్రీదేవి అంటూ పేరు దక్కించుకున్న జాన్వీ కపూర్‌ ఇటీవల ముంబయిలోని ఖరీదైన ఏరియా జుహూ లో ఏకంగా 39 కోట్లు పెట్టి ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందట.

జుహూలో కేవలం స్టార్స్‌ కు మాత్రమే ఇళ్లు ఉంటాయి. అలాంటి ఖరీదైన ప్రాంతంలో జాన్వీ అప్పుడే ఇల్లు కొనుక్కో గలిగింది అంటే ఆమె ఆదాయం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్‌ అంబాసిడర్ గా ఇంకా సోషల్‌ మీడియా ప్రమోటింగ్‌ ద్వారా కూడా జాన్వీ కపూర్‌ ఆదాయం దక్కించుకుంటుంది. దానికి తోడు తండ్రి కూడా గిప్ట్‌ గా ఆమెకు కొంత మొత్తం డబ్బు ఇచ్చాడేమో అందుకే అక్కడ అంత భారీ గా ఖర్చు పెట్టి ఇళ్లు తీసుకుని ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: